Prime9

KCR farm house: కేసీఆర్ ఫాంహౌస్‌లో జనగామ ఎమ్మెల్యేకు గాయాలు.. యశోదకు తరలింపు

Janagama MLA Palla Rajeswar Reddy Accident in KCR farm house: జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డికి గాయాలయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డాడు. ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. కాగా, పల్లా.. రాత్రి నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారీపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయనకు తుంటి ఎముకకు గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

 

ఇదిలా ఉండగా, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం ముందు హాజరు కానున్నారు. ఇందులో భాగంగానే బీఆర్‌కే భవన్‌లో విచారణకు వెళ్తున్నారు. అయితే కేసీఆర్‌ను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు అధిక సంఖ్యలో ఎర్రవల్లి ఫాంహౌస్ వద్దకు చేరుకుంటున్నారు.

Exit mobile version
Skip to toolbar