Prime9

Ration Card: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్.. ఒకేసారి 3 నెలల రేషన్

Good News For Ration Card Holders: రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ లబ్ధిదారులకు ఇవాళ్టి నుంచి 3 నెలల రేషన్ పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ సర్కార్ జూన్‌ నెలతో పాటు జులై, ఆగస్టుకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని అందజేసేందుకు పౌరసరఫరాల శాఖ సిద్దమైంది. హైదరాబాద్ పరిధితో పాటు 33 జిల్లాల్లో సన్నబియ్యంతో పాటు పంచదార, గోధుమలను రేషన్ షాపుల్లో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

 

ఇదిలా ఉండగా, జనగామ జిల్లాలోని పలు రేషన్ దుకాణాల్లో ఈపాస్ మెషీన్లు మొరాయించాయి. అయితే మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. పాత సాప్ట్‌వేరును పౌరసరఫరాల శాఖ అప్‌డేట్ చేసింది. కొత్త సాప్ట్ వేర్‌లో లోపంతో రేషన్ పంపిణీకి ఆటంకం కలిగింది. కాగా, వాతావరణ ప్రతికూల పరిస్థితులతో కేంద్రం అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే, రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు 3 నెలల రేషన్ పంపిణీ చేస్తోంది.

Exit mobile version
Skip to toolbar