Prime9

Fire Accident in Hyderabad: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. మంటల్లో తొమ్మిది మంది మృతి!

Sevan Killed Fire Accident in Hyderabad: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మీర్‌చౌక్ ప్రాంతంలోన గుల్జార్ హౌస్ దగ్గర ఓ భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఇందులో నుంచి ముగ్గురు చిన్నారులతో సహా 16 మందిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 30 మంది ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి 10 అంబులెన్సులు చేరుకున్నాయి.

 

ఈ మేరకు చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులను మూసివేశారు. కాగా, మంట్లలో చిక్కుకున్న వారిని ఫైట్ ఫైటర్స్ రక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను 10 ఫైరింజన్ల సహాయంతో అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం భవనంలో నాలుగు కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోని మీర్‌చౌక్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉండగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడిన వారిని మలక్ పేట యశోద, హైదర్ గూడ్ అపోలో కంచన్ బాగ్ఆ అపోలో ఆస్పత్రులకు తరలించారు. బాధితులు మొత్తం మూడు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 

మృతుల్లో అభిషేక్(30), ఆరూషి జైన్(17), హర్షాలీ గుప్తా(7), శీతల్ జైన్(37), రాజేందర్(67), సుమిత్ర(65), మున్నిబాయ్(72),ఇరాజ్(2) ఉన్నారు. కాగా, ఘటనాస్థలానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నారు. ఈ మేరకు అక్కడి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధితులతో మాట్లాడారు.

Exit mobile version
Skip to toolbar