Prime9

Tenders: ఇంకా మూడు రోజులే గడువు.. బార్లకు భారీగా దరఖాస్తులు

Telangana: జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లకు దరాఖాస్తు చేసుకునేందుకు మిగిలిన మూడు రోజుల్లో భారీగా దరఖాస్తులు రానున్నాయని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ వెల్లడించారు. ఈ మేరకు దరఖాస్తులు తీసుకునేందుకు నాంపల్లిలోని ఏక్సైజ్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కాగా రూరల్ ఏరియాలో ఏర్పాటు చేయనున్న బార్లకు భారీగా దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే జీహెచ్ఎంసీతో కలుపుకుని 28 బార్ల పునరుద్ధరణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లకు 356 అప్లికేషన్లు వచ్చాయని వెల్లడించారు.

 

రూరల్ బార్ల కంటే ఎక్కువగా జీహెచ్ఎంసీలో దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నట్టు తెలిపారు. కాగా అప్లికేషన్ చేసుకునేందుకు ఈనెల 6వరకు గడువు ఉందని పేర్కొన్నారు. కాగా రానున్న మూడు రోజుల్లో 3 నుంచి 5 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అలాగే దరఖాస్తులు సమర్పించేందుకు జమచేసే డిపాజిట్ అమౌంట్ వల్ల ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లతోపాటు సరూర్ నగర్ జల్ పల్లి, మహబూబ్ నగర్, నిజామాబాద్, బోధన్ లో ఒక్కొక్క బార్ కు దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar