Prime9

Suryapet: ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి

Suryapet: సూర్యపేటలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆర్టీసీని ఆధునికరిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి పొన్నం ప్రభాకర్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి సూర్యాపేటలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించారు. సూర్యాపేటలో ఒకేరోజు 45 బ్యాటరీ బస్సులను ప్రారంభించినట్టు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. గత పాలకులు ఆర్టీసీని నిర్వర్యం చేశారని విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రొగ్రెసివ్ ఆలోచనలతో ఆర్టీసీని ముందుకు తీసుకుపోతున్నారని అన్నారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఓఆర్ఆర్ లోపల 2 వేల 8 వందల బ్యాటరీ బస్సులు తీసుకువచ్చినట్టు చెప్పారు.

Exit mobile version
Skip to toolbar