Prime9

Rajanna Kodelu : వేములవాడ రాజన్న కోడెలకు దరఖాస్తులు

Applications for Vemulawada Rajanna Kodela : వేములవాడ రాజరాజేశ్వర స్వామికి భక్తుల సమర్పించిన కోడెలను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం నుంచి కోడెలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ ప్రకటన విడుదల చేశారు. మొదటి విడతలో 300 కోడెలను చిన్నవాటిని పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. జియో ట్యాగింగ్ కలిగి ఉన్న వాటిని రైతులకు అందజేస్తామని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు.

 

రైతులు పట్టాపాస్ పుస్తకం, ఆధార్ కార్డుతో https://rajannasircilla.telangana.gov.in/ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. రాజన్న ఆలయ గోశాలల్లో 1250 పైగా కోడెలు ఉండగా, పకడ్బందీగా పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

 

ఇటీవల గోశాలలో కోడెలు మృతిచెందాయి. శుక్ర, శనివారాల్లో 13 కోడెలు మృతిచెందాయి. తిప్పాపురంలోని గోశాలలో కోడెల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ గోశాలను తనిఖీ చేశారు. కోడెలకు అందిస్తున్న మేత, ఇతర పదార్థాల నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. అకాల వర్షాలు, అనారోగ్య కారణాలతో ఎనిమిది కోడెలు మృతిచెందినట్లు తెలిపారు. కోడెల సంరక్షణను మరింత బాధ్యతగా చూసుకోవాలన్నారు. సరిపడా దాణా, పచ్చగడ్డి పెట్టాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

Exit mobile version
Skip to toolbar