Prime9

AP CM Chandrababu : జెంటిల్‌మెన్‌కు ప్రతిరూపం బండారు దత్తాత్రేయ : ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu participated in the book launch of Dattatreya’s autobiography ‘Prajale Naa Atma Katha’ : జెంటిల్‌మెన్‌కు ప్రతిరూపం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ‘ప్రజలే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దత్తాత్రేయను దత్తన్న అని అభిమానంగా పిలుచుకుంటారని చెప్పారు. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా ఎదిగారని కొనయాడారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణలు ఎదుర్కొన్నారన్నారు. ‘బండారు’ పేరుకు హిందుత్వం, మతం భారతీయం అని చెప్పారు.

 

దత్తాత్రేయ కోరుకుంది జనహితం అన్నారు. ఆయనది లౌకిక వాదమని చెప్పారు. దత్తాత్రేయ పాటించేది మత సామరస్యం అన్నారు. ‘అలయ్ బలయ్’ పేరుతో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చారన్నారు. అందరినీ కలిపేందుకు వేదిక రూపొందించారని కొనియాడారు. ఆయనకు విరోధులు ఎవరూ ఉండన్నారు. దత్తాత్రేయకు ఏ రాజకీయ పార్టీ అనే వ్యత్యాసం ఉండదని తెలిపారు. ఆయనది ఆదర్శ రాజకీయం జీవితం అన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులకు లేఖలు రాశారని గుర్తుచేశారు. లేఖలు రాయటంలో అంబాసిడర్‌గా నిలిచారన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అనునిత్యం పనిచేశారన్నారు. ఉత్తర, దక్షిణ భారత్ ప్రజలతో దత్తాత్రేయ మమేకమయ్యారని తెలిపారు.

Exit mobile version
Skip to toolbar