2 Killed in Adilabad Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూర్ మండలం బీర్సాయిపేట వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానికుల సమచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆదిలాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.