Prime9

ACB Raids: తెలంగాణలో ఏసీబీ సోదాలు.. ఏకకాలంలో 14 చోట్ల తనిఖీలు

ACB Raids in Telangana: తెలంగాణలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట, బెంగళూరులోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు.

 

ఇందులో భాగంగానే నూనె శ్రీధర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నూనె శ్రీధర్ పనిచేశారు. ఈ ప్రాజెక్టులో 6, 7 , 8 ప్యాకేజీ పనులను ఆయన పర్యవేక్షించారు. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్‌పీ డివిజన్ 8లో ఈఈగా శ్రీధర్ పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఇరిగేషన్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా నియామకమయ్యారు.

Exit mobile version
Skip to toolbar