Prime9

ACB : కళ్లు బైర్లు కమ్మేలా.. కాళేశ్వరం ఈఈ అక్రమాస్తులు రూ.వందల కోట్లు

Irrigation Department EE Sridhar‌ : కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్‌ నివాసం, కార్యాలయం, అతడి బంధువుల నివాసల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా ఆస్తులను గుర్తించారు. తెల్లాపూర్‌లో విల్లా, షేక్‌పేటలో ప్లాట్‌, కరీంనగర్‌లో మూడు ఓపెన్‌ ప్లాట్లు, అమీర్‌పేటలో వాణిజ్య భవనం, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌లో మూడు ఇండిపెండెంట్‌ ఇండ్లు, అతడికి సంబంధించి 16 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌లో 19 ఓపెన్‌ ప్లాట్లు ఉన్నట్లు తేలింది. బహిరంగ మార్కెట్‌లో ఆస్తుల విలువ రూ.వందల కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.

 

రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో నగదు నిల్వలు తనిఖీల్లో బయటపడ్డాయి. శ్రీధర్‌ తన పదవిని అడ్డం పెట్టుకొని అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ నిర్ధారించింది. దీంతో శ్రీధర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. అధికారులు అతడిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాల్సి ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. శ్రీధర్‌ ఎస్‌ఆర్‌ఎస్పీ డివిజన్‌-8లో ఈఈగా పనిచేస్తున్నారు. కాళేశ్వరంలో 6, 7, 8 ప్యాకేజీల పనులను కూడా పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇరిగేషన్‌ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar