Prime9

PV Narasimha Rao Statue: ఢిల్లీలో పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు.. ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం!

Former Prime Minister PV statue in Delhi: దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు. విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ కీలక ఆమోదం తెలిపింది. కేంద్రం నిర్ణయమే తరువాయిగా మారింది. తెలంగాణ భవన్‌‌లో విగ్రహం ఏర్పాటుకు న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన చేసింది. ఢిల్లీలో ఇటీవల జరిగిన సమావేశంలో విగ్రహం ఏర్పాటుకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఎన్డీఎంసీ ప్రతిపాదన మేరకు ఢిల్లోని తెలంగాణ భవన్‌లో పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు ప్రతిపాదిత స్థలంలో ఏర్పాట్లకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ సూచనలు చేసింది.

 

ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్..

ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మించేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ భవన్ ఆంధ్ర భవన్‌తో కలిసి ఉన్నందున ఇక్కడ ఏర్పాటు సాధ్యం కాదని తెలంగాణ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర భవన్‌లో ఉన్న ఏపీ మాజీ సీఎం ప్రకాశం పంతులు విగ్రహానికి సమీపంలో పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయాలని పీవీ నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ కోరింది. ప్రతిపాదనను ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ పంపించగా, కమిషన్ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో పీవీ స్మారకం ఏర్పాటుతోపాటు ఆయనకు ఎన్డీఏ భారతరత్న ఇచ్చి గౌరవించింది.

 

పీవీని అవమానించిన కాంగ్రెస్..

పీవీ విగ్రహాన్ని ఏర్పాటు కార్యక్రమానికి ప్రధాని ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పీవీని కాంగ్రెస్ నేతలు అవమానించారు. పీవీ విగ్రహాన్ని కాంగ్రెస్ కార్యాలయంలో పెట్టనివ్వలేదు. పీవీ అంత్యక్రియలు ఢిల్లీలో జరగకుండా హైదరాబాద్‌లో జరిగాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం పీవీకి గౌరవం ఇచ్చింది. భారతరత్న ఇచ్చి గౌరవించింది. ఇప్పుడు ఢిల్లీలో పీవీకి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్డీయేకు దక్కుతుంది.

 

Exit mobile version
Skip to toolbar