iPhone 16: ఫస్ట్ టైమ్.. ఐఫోన్ 16పై రూ.16 వేల డిస్కౌంట్.. మిస్ అయితే రాదు..!

iPhone 16: గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్రాండ్‌కు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆపిల్ ఎటువంటి గ్యాడ్జెట్లను తీసుకొస్తున్న ఎక్కడలేని హైప్ క్రియేట్ చేస్తుంటి. అటువంటి వాటిల్లో ఒకటి ఇటీవలే లాంచ్ అయిన ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు. వీటిని దక్కించుకొనేందుకు మొబైల్ ప్రియులు పోటీపడ్డారు. మీరు ఐఫోన్ 16 కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వార్త మీకోసమే. ఐఫోన్ 16 ధరలో ఇప్పటివరకు అతిపెద్ద కోత విధించింది. సెప్టెంబర్ లో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.16,000 తగ్గింది. ఈ యాపిల్ ఫోన్‌లో AI ఫీచర్లు ఉన్నాయి. డెడికేటెడ్ క్యాప్చర్ బటన్ కూడా ఉంది. రండి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Apple iPhone 16 Sale Offer
ఆపిల్ ఇటీవల క్రిస్మస్ కార్నివాల్ సేల్‌ను ప్రకటించింది. ఇది ఈ రోజు అంటే డిసెంబర్ 27న ముగుస్తుంది. ఈ సేల్‌లో ఐఫోన్ 16ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. iPhone 16ని 128GB, 256GB+ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో కొనుగోలు చేయచ్చు.

iPhone 16 Bank Offer
ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.79,900. ఫోన్ కొనుగోలుపై రూ.3,500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. SBI, ICICI, Kotak బ్యాంక్ కార్డులపై రూ.4,000 అదనపు తగ్గింపు అందుబాటులో ఉంటుంది.

iPhone 16 Exchange Offer
ఇది కాకుండా, మీరు పాత ఫోన్‌ను మార్చుకుంటే రూ. 8,000 వరకు బోనస్ పొందుతారు. మీ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌కి మంచి స్థితిలో ఉండాలి. ఈ ఆఫర్‌లన్నింటినీ కలపడం ద్వారా, iPhone 16 ప్రారంభ ధర రూ. 64,400 వద్ద కొనుగోలు చేయవచ్చు.

iPhone 16 Specifications
iPhone 16 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది OLED ప్యానెల్. కర్వ్‌డ్ కార్నర్స్  డిజైన్ ఫోన్‌తో అందుబాటులో ఉన్నాయి. ఫోన్‌తో డైనమిక్ ఐలాండ్ కూడా అందుబాటులో ఉంది, ఇది మొదట ఐఫోన్ 14 ప్రో మోడల్‌తో పరిచయం చేశారు. డిస్‌ప్లే పీక్ బ్రైట్నెస్ నిట్స్, ఇది ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ కోటింగ్‌ను కూడా కలిగి ఉంది.