Xiaomi 15 Series: అదరగొట్టారు.. షియోమీ 15 సరీస్ నుంచి రెండు ఫోన్లు.. ఓయమ్మా ఇవేం ఫీచర్లు రా సామి..!

Xiaomi 15 Series: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌ ప్రాసెసర్‌తో షియోమీ 15 సరీస్ ఫోన్లను చైనాలో ప్రారంభించింది. ఈ సిరీస్‌లో ప్రో వేరియంట్‌తో సహా రెండు ఫోన్లు ఉన్నాయి. రెండు ఫోన్‌లు క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌తో వస్తాయి. షియోమీ 15 సిరీస్ గత సంవత్సరం 14 సిరీస్‌లో అప్‌గ్రేడ్ చేసిన కెమెరాలు, పెద్ద బ్యాటరీ, వేగవంతమైన చిప్‌సెట్‌తో అనేక అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. షియోమీ ఈ తాజా ఫ్లాగ్‌షిప్ లైనప్‌ గురించి వివరంగా తెలుసుకుందాం.

షియోమీ 15 సిరీస్ 12GB RAM + 256GB స్టోరేజ్‌తో బేస్ మోడల్ CNY 4499 అంటే సుమారు రూ. 52,994లతో ప్రారంభమయ్యే నాలుగు వేరియంట్‌లలో లభిస్తుంది. దీనిలో కస్టమ్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. 40 కలర్ షేడ్స్‌లో ఎంచుకోవచ్చు. ఈ మోడల్ 16GB + 512GB కాన్ఫిగరేషన్‌లో ఉంది.

దీని ధర CNY 4999 అంటే సుమారు రూ. 58,884. దీని తరువాత షియోమీ 15 ప్రో  బేస్ మోడల్ కూడా CNY రూ. 5499కి 12GB + 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్ ఐదు కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. అందులో బ్లాక్, వైట్, గ్రీన్, లిలక్, సిల్వర్, లిమిటెడ్ డైమండ్ ఎడిషన్ ఉన్నాయి. 15 సిరీస్ అక్టోబర్ 31 నుండి చైనాలో సేల్‌కి వస్తుంది.

Xiaomi 15 Series Specifications
షియోమీ స్మార్ట్‌ఫోన్ 6.36 అంగుళాల 1.5K డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ప్రో మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.73-అంగుళాల 2K మైక్రో-కర్వ్డ్ OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. రెండు ఫోన్‌లు 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తోంది. షియోమీ 15లో 50MP లైట్‌హంటర్, 900 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP 3.2x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32MP OmniVision OV32B40 ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ప్రో మోడల్ 50MP LightHunter 900 ప్రైమరీ సెన్సార్, 50MP సామ్‌సంగ్ JN1 అల్ట్రా-వైడ్ కెమెరా,  50MP సోనీ IMX858 5X పెరిస్కోప్ లెన్స్‌తో వస్తుంది. వనిల్లా మోడల్‌కు కోసం 5400mAh బ్యాటరీ,  90W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అదనంగా ప్రో మోడల్ మరింత పెద్ద 6100mAh బ్యాటరీని కలిగి ఉంది.

అదే ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీని అందిస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్‌ఓఎస్ 2.0 పై పనిచేస్తాయి. ఈ సరికొత్త కస్టమ్ OSలో రన్ అవుతున్న మొదటి ఫోన్‌లు ఇవే. 15 సిరీస్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం- IP68 రేటింగ్‌ పొందుతారు. ఇది కాకుండా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఉంది.