Site icon Prime9

Whats App New Update : మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్.. “చాట్ లాక్” స్పెషాలిటీ ఏంటంటే?

whats app new update about chat lock feature

whats app new update about chat lock feature

Whats App New Update : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు సరికొత్త ఫిచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా మరో ఫీచర్ ను యూజర్లకు అందించనుంది. యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేయడంతో పాటు యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్‌ ఇప్పుడు మరో కొత్త అప్డేట్ ని తీసుకొచ్చింది. ఈ కారణం గానే మార్కెట్లోకి ఎన్ని మెసేజింగ్ యాప్స్‌ వచ్చినా వాట్సాప్‌కు క్రేజ్‌ తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పాలి. ఇప్పుడు వాట్సాప్ నూతనంగా తెచ్చిన ఆ ఫీచర్ ఏంటి ? ఆ ఫీచర్ ప్రత్యేకతలు ఏంటో మీకోసం..

లాక్‌చాట్..

‘లాక్‌చాట్’ పేరుతో వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తాము కోరుకుంటున్న చాట్‌ను ఇతరులకు కనిపించకుండా చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న కాంటాక్ట్‌ను పాస్‌వర్డ్‌ లేదా ఫింబర్‌ ప్రింట్‌తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు ప్రొటెక్ట్ చేసుకున్న కాంటాక్ట్‌ చాట్ బాక్స్‌లో కూడా కనిపించదు. అలాగే సదరు కాంటాక్ట్ నుంచి మెసేజ్‌ వచ్చినా పైన కనిపించే నోటిఫికేషన్‌లో ఆ మెసేజ్‌ కనిపించదు.

ఇలా తమ పర్శనల్స్ ని సీక్రెట్ గా ఉంచేందుకు ఈ కొత్త ఫీచర్‌కు ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే ఈ ఫీచర్ కి సంబంధించిన వీడియోను మెటా సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఈ కొత్త ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలి? దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనే విషయాలను వెల్లడించారు. ఇక సోమవారం రాత్రి నుంచి యూజర్లకు ఈ అప్‌డేట్‌ (Whats App New Update) ను అందించింది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ అధికారికంగా ప్రకటించారు.

 

Exit mobile version