Site icon Prime9

Vivo V50: మంచి కెమెరా ఫోన్.. త్వరలో వివో V50 లాంచ్.. ఇది వేరే లెవల్..!

Vivo V50

Vivo V50: టెక్ బ్రాండ్ వివో త్వరలో V50 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఇటీవల ఈ మొబైల్ తైవాన్ నేషనల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (NCC) వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్‌లో Vivo V50 డిజైన్, కలర్ ఆప్షన్లు, బ్యాటరీ, ఛార్జింగ్ వివరాల గురించిన మొత్తం సమాచారం వెల్లడైంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6,000mAh బ్యాటరీ, Wi-Fi 6, 50MP కెమెరాలను పొందగలదని తెలుస్తుంది. వివో V50 గత సంవత్సరం ప్రారంభించిన V30 అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం Vivo V50ని Vivo S20  రీబ్రాండెడ్ వెర్షన్‌గా పరిచయం చేయవచ్చు. Vivo S20 గత ఏడాది నవంబర్‌లో చైనాలో CNY 2,299 (సుమారు రూ. 27,000) ప్రారంభ ధరతో విడుదల చేశారు. అటువంటి పరిస్థితిలో, ఇతర మార్కెట్లలో దీని ధర దాదాపుగా ఇలానే ఉండవచ్చు.

Vivo V50 మోడల్ నంబర్ V2427 తో NCC వెబ్‌సైట్‌లో గుర్తించారు. ఈ లిస్టింగ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొలతలు 160mmX5mm అని చెబుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డిస్‌ప్లే సెంటర్‌లో హోల్-పంచ్ కటౌట్ చూడవచ్చు. వెనుక ప్యానెల్‌లో Vivo బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇది కాకుండా, Vivo సిగ్నేచర్ పిల్ ఆకారంలో ఉన్న కెమెరా ఐలాండ్ ఫోన్ వెనుక భాగంలో చూడచ్చు. ఈ ఫోన్ 6.67 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.

బ్యాటరీ గురించి మాట్లాడినట్లయితే Vivo V50 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది కాకుండా, ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో Wi-Fi 6, బ్లూటూత్, NFC, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కూడా కలిగి ఉంటుంది. వివో కొత్త ఫోన్ మూడు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఇందులో బ్లూ, గ్రే, వైట్ కలర్స్ ఉన్నాయి.

ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో  స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌లో పని చేస్తుంది. ఇది కాకుండా, ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది, ఇందులో LED ఫ్లాష్‌తో 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉండవచ్చు. ఇది సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.

Exit mobile version