Vivo V50 Series: టెక్ మేకర్ వివో ఇండియాలో Vivo V50 సిరీస్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్‌లో కంపెనీ V50, V50 Pro అనే రెండు కొత్త ఫోన్‌లు ఉంటాయి. రెండు డిజైన్‌లు జీస్ ఆప్టిక్స్‌లో ఉంటాయి. ఈ డిజైన్‌తో యూజర్లు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీని క్యాప్చర్ చేయచ్చు. Vivo V50 సిరీస్‌కు సంబంధించి, ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఫోన్ ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఈ సిరీస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వివో భారత్‌లో Vivo V50 సిరీస్ అధికారిక ప్రారంభ తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ ఫోన్ ఫిబ్రవరి 18న లాంచ్ అవుతుందని లీకులు చెబుతున్నాయి. Vivo V50 సిరీస్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇ-స్టోర్ భాగస్వామి ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ ధృవీకరించింది.
Vivo V50 Series Price
Vivo V50 ధర రూ. 35,000, Vivo V50 Pro ధర రూ. 50,000 ఉండవచ్చని అంచనాలు చెబుతున్నాయి. మీరు ఫోన్‌పై రూ. 5,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్, ప్రీ-బుకింగ్ ఆఫర్‌ను కూడా దక్కించుకోవచ్చు.
Vivo V50 Features
Vivo రాబోయే Vivo V50 సిరీస్ గురించి అనేక వివరాలను ధృవీకరించింది. రిఫైన్డ్ మాస్టర్-లెవల్ ఇమేజింగ్‌తో కూడిన జీస్ ఆప్టిక్స్ ఈ ఫోన్‌లకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని కంపెనీ తెలిపింది.
వివో V50 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్, Vivo కెమెరా-బయోనిక్ స్పెక్ట్రమ్‌తో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అలానే 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో 50మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్‌తో ఉంటుంది. రెండు సెన్సార్లు జీస్ లెన్స్‌లను కలిగి ఉంటాయి. V సిరీస్ ప్రత్యేకత అయిన ఆరా లైట్ కూడా Vivo V50లో భాగం అవుతుంది.
పోర్ట్రెయిట్ ఫోటోల కోసం ఫోన్ మూడు ఫోకల్ లెంగ్త్ మోడ్‌లను అందిస్తుంది. 23మిమీ, 35మిమీ, 50మిమీ. ప్రొఫెషనల్-గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం బోకె, జూమ్‌లను అడ్జస్ట్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా Zeiss సపోర్ట్‌తో 50మెగాపిక్సెల్ షూటర్ ఉంది.
V50 దేశంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ అని, భారీ 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని Vivo పేర్కొంది. ఫోన్ మూడు కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. అందులో రోజ్ రెడ్, టైటానియం గ్రే, స్టార్రీ బ్లూ. స్టార్రీ బ్లూ వేరియంట్ భారతదేశపు మొట్టమొదటి 3డి-స్టార్ టెక్నాలజీని స్మార్ట్‌ఫోన్‌లో పరిచయం చేస్తుంది.
V50 IP68, IP69-రేటెడ్ డస్ట్,వాటర్ రెసిస్టెన్స్‌తో ఉంటుంది. ఫోన్ వాటర్ డ్రాప్స్ నుంచి సేఫ్‌గా ఉండేలా చూసేందుకు షాట్ డైమండ్ షీల్డ్ గ్లాస్‌ని కలిగి ఉన్నట్లు నిర్ధారించింది. అలానే ఈ ఫోన్‌లో క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌పై ఫోన్‌లో ఉండే అవకాశం ఉంది.