Vivo Y300 5G: వివో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. తక్కువ ధరకే హై ఎండ్ ఫీచర్లు..!

Vivo Y300 5G: స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయబోతోంది. కంపెనీ ఈ కొత్త ఫోన్‌ను  Vivo Y300 5G పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇది నవంబర్ 21న భారతదేశంలోకి వస్తుంది. ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈలోగా ఈ ఫోన్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి . ఇందులో ఈ రాబోయే ఫోన్ రెండు కలర్ వేరియంట్‌లలో కనిపిస్తుంది.

లీక్‌ ప్రకారం ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలానే దీని ధర రూ. 19,999 ఉంటుందని సమాచారం. ఫోన్ 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌ కెమెరా ఉంటుంది. 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లు ఉంటాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Vivo V40 Lite ఇండోనేషియా వేరియంట్ రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. V40 లైట్ ఫీచర్ల గురించి మాట్లాడితే కంపెనీ ఫోన్‌లో గరిష్టంగా 12 GB RAM+ 512 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. ప్రాసెసర్‌గా మీరు ఫోన్‌లో Snapdragon 4 Gen 2ని చూడవచ్చు.

ఫోన్ 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో కూడిన 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది.

ఫోన్‌ను పవర్ చేయడానికి ఇది 5000mAh బ్యాటరీతో రానుంది. ఈ బ్యాటరీ 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం కంపెనీ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తోంది. ఓఎస్ గురించి మాట్లాడితే ఫోన్  ఇండోనేషియా వేరియంట్ Android 14 ఆధారంగా Funtouch OS 14లో పని చేస్తుంది. Vivo Y300 5G ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుందని టెక్ బ్రాండ్ తెలిపింది.