Vivo V50e Launch: వివో తన కొత్త V-సిరీస్ స్మార్ట్‌ఫోన్ Vivo V50eని ఈరోజు ఏప్రిల్ 10న భారత్ మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. లాంచ్‌కు ముందు ఫోన్ అనేక ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. ఇది మాత్రమే కాదు, ఫోన్ ధర కూడా తెలిసింది. ఈ మొబైల్ రూ.30 వేల కంటే తక్కువ ధరకు లాంచ్ కావచ్చని చెబుతున్నారు. ఇంతకముందు కంపెనీ దేశంలో V40eని రూ.28,999 ధరకు విడుదల చేసింది. అదేవిధంగా, ఇప్పుడు ఈ ఫోన్ కూడా అదే ధరకు వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్‌లో ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.
Scratch Resistance, Drop Protection
మీ ఫోన్ తరచుగా పడిపోతుంటే లేదా నీటి కారణంగా మీ ఫోన్ పాడైపోతుందని మీరు భయపడుతుంటే, ఈ స్మార్ట్‌ఫోన్ మీ కోసమే.. ఎందుకంటే ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్ బిల్డ్‌తో వస్తుంది. ఇది కాకుండా, ఫోన్‌లో డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ అందించారు ఇది మెరుగైన స్క్రాచ్ రెసిస్టెన్స్, డ్రాప్ ప్రొటెక్షన్‌ను అందిస్తుంది.
90W Fast Charging
వివో నుండి వచ్చిన ఈ కొత్త ఫోన్ మీడియాటెక్ 7300 చిప్‌సెట్ ఉంటుంది. అలానే పెద్ద 5,600mAh బ్యాటరీ కూడా ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ ఈ మిడ్ రేంజ్ బడ్జెట్ సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైన ఛార్జింగ్‌ని అందిస్తుంది.
Front Camera With Eye Autofocus
ఫోన్ కెమెరా కూడా ప్రధాన హైలైట్ కానుంది. ముందు భాగంలో ఐ ఆటోఫోకస్‌తో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది స్పష్టమైన ఫోకస్ సెల్ఫీలు, 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ అందిస్తుంది.
Sony camera
ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయి. అయితే, ఫోన్‌లో అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మోడ్ అందుబాటులో ఉంటుందో లేదో తెలియదు.
AI Features
వివో V50e కూడా చాలా AI ఫీచర్స్‌తో రాబోతోంది, ఇవి ప్రొడక్టవీటి, క్రియేట్‌విటీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. వీటిలో క్విక్ ఫోటో ఎడిటింగ్ కోసం మ్యాజిక్ ఎరేజర్, టెక్స్ట్-ఆధారిత పనుల కోసం నోట్ అసిస్ట్, ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, ఇమేజ్ ఎక్స్‌పాండర్, ఫాస్ట్ విజువల్ క్వశ్చన్స్ కోసం సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఉంటాయి.