Site icon Prime9

Vivo V50e Launch Date In India: రెడీగా ఉండండి.. ఖతర్నాక్ కెమెరాతో Vivo V50e వచ్చేస్తుందోచ్.. కలర్ ఆప్షన్లు కెవ్ కేక..!

Vivo V50e Launch Date In India

Vivo V50e Launch Date In India

Vivo V50e Launch Date In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో తన బ్రాండ్‌ను కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. అంతేకాకుండా కలర్ ఆప్షన్లు, కెమెరాతో సహా కొంత సమాచారాన్ని కంపెనీ తన X ఖాతా ద్వారా వెల్లడించింది. అయితే ‘Vivo V50e’ గురించి కొంత సమాచారం ఇప్పటికే లీక్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌‌ను Vivo V40eలో ఉండే ఫీచర్స్‌తో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో Vivo V50e గురించి వివరంగా తెలుసుకుందాం రండి..!

 

Vivo V50e Launch Date
Vivo V50e స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 10న ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో మూడు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. పెరల్ వైట్, సఫైర్ బ్లూ. మొబైల్‌లోని 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 వెనుక కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తుంది. ఇది కాకుండా, 116 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ, వృత్తాకార ఆరా లైట్ ఫీచర్‌తో అల్ట్రా వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా ఉంది.

 

Vivo V50e Price
Vivo V50e స్మార్ట్‌ఫోన్‌ను రూ. 25,000 నుండి రూ. 30,000 మధ్య ధరతో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్, వివో ఇ-స్టోర్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. లాంచ్ అయిన కొన్ని రోజుల తర్వాత ఫోన్ మొదటి సేల్ ప్రారంభమవుతుంది. అయితే ఈ విషయాన్ని కంపెనీ ఇంకా ధృవీకరించలేదు.

 

Vivo V50e Specifications
Vivo V50e స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఫోన్ ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. వెనుక, ముందు కెమెరాలు రెండూ 4K వీడియో రికార్డింగ్‌తో అందుబాటులో ఉంటాయి. డిస్‌ప్లే గురించి మాట్లాడితే ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల 1.5K స్క్రీన్‌ ఉంటుంది. ఫోన్ డస్ట్, వాటర్ నుంచి ప్రొటక్ట్ చేయడానికి IP68, IP69 రేటింగ్‌లను అందించారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,600mAh బ్యాటరీతో వస్తుంది.

 

Exit mobile version
Skip to toolbar