Site icon Prime9

Vivo V50: ట్రెండ్ సెట్టర్.. వివో నుంచి కెమెరాల ఫోన్.. ముందుగా బుక్ చేయండి..!

Vivo V50 5G

Vivo V50 5G

Vivo V50: వివో ఇండియాలో 6,000mAhకెపాసిటీ బ్యాటరీతో తన ఫోన్‌ను విడుదల చేసింది. V సిరీస్‌లో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌లో కర్వ్డ్ డిస్‌ప్లేతో సహా అనేక శక్తివంతమైన ఫీచర్లు ఉన్నాయి. వివో ఈ బడ్జెట్ ఫోన్ ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. ఈ ఫోన్ సేల్ వచ్చే వారం భారత్‌లో ప్రారంభం కానుంది. కంపెనీ ఈ ఫోన్ Vivo V50 పేరుతో పరిచయం చేసింది. కంపెనీ దీన్ని ఇప్పటికే చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. చైనీస్ కంపెనీకి చెందిన ఈ ఫోన్‌లోని అనేక ఫీచర్లు ఫ్లాగ్‌షిప్ ఎక్స్ సిరీస్ లాగా ఉంటాయి. వివో ఈ శక్తివంతమైన ఫోన్ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Vivo V50 Price
వివో నుండి ఈ ధృడమైన స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది – 8GB RAM + 128GB, 8GB RAM + 256GB, 12GB RAM + 256GB. దీని ప్రారంభ ధర రూ.34,999. దాని ఇతర రెండు వేరియంట్‌ల ధర వరుసగా రూ. 36,999, రూ. 40,999. ఈ ఫోన్ మొదటి సేల్ ఫిబ్రవరి 25, 2025న ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ కాకుండా, కంపెనీ అధికారిక ఆన్‌లైన్ ,ఆఫ్‌లైన్ ఛానెల్‌లలో నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి ఈ ఫోన్ ప్రీ బుకింగ్ ప్రారంభమైంది.

Vivo V50 Features
Vivo V50 టైటానియం గ్రే, స్టార్రీ నైట్, రోజ్ రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌తో విడుదలైంది. ఫోన్ IP68, IP69 రేటింగ్ కలిగి ఉంది, దీని కారణంగా ఫోన్ నీటిలో మునిగిపోయే ప్రమాదం లేదా దుమ్ము, ధూళి మొదలైన వాటి కారణంగా పాడైపోయే ప్రమాదం లేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా FuntouchOS 15లో పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB వరకు LPDDR4X RAM, 512GB వరకు UFS 2.2 స్టోరేజీకి సపోర్ట్ ఇస్తుంది.

వివో ఈ మిడ్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 6.77 అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz అధిక రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ డిస్‌ రిజల్యూషన్ 2392 x 1080 పిక్సెల్‌లు, ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే పీక్ బ్రైట్నెస్ 4,500 నిట్‌ల వరకు ఉంటుంది.

ఈ వివో ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఫోన్‌లో 50MP మెయిన్ ఆటోఫోకస్ కెమెరా ఉంది. ఇది 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో అందించారు. ఈ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP కెమెరా కూడా ఉంటుంది. USB టైప్ C, Wi-Fi సహా కనెక్టివిటీ కోసం అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

Exit mobile version
Skip to toolbar