Site icon
Prime9

Vivo T4 Ultra 5G Discount Offer: స్పెషల్‌గా ఉంటుంది.. వివో కొత్త స్మార్ట్‌ఫోన్.. సేల్‌కి రాకముందే డిస్కౌంట్లు!

Vivo T4 Ultra 5G Discount Offers

Vivo T4 Ultra 5G Discount Offers

Huge Discount offers on Vivo T4 Ultra 5G Mobile: వివో T4 అల్ట్రా భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. దీనితో ఫోన్ అన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. కంపెనీ కొత్త 5G ఫోన్ రూ. 40 నుండి 45 వేల ధరల పరిధిలో లాంచ్ చేసింది. దీని మొదటి సేల్ కూడా విడుదలైన కొన్ని రోజుల్లోనే ప్రారంభమవుతుంది. ఈ కాలంలో కంపెనీ బ్యాంక్ ఆఫర్లను అందిస్తుంది. దీనితో పాటు, ఇతర ఆఫర్ల ప్రయోజనం కూడా లభిస్తుంది, దీని కారణంగా Vivo T4 Ultra ధరను గణనీయంగా తగ్గించవచ్చు. భారతదేశంలో Vivo T4 Ultra ధర ఎంత? మొదటి సేల్ తేదీ, ఫోన్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్‌లు, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

 

Vivo T4 Ultra 5G Launch Price

Vivo T4 Ultra 5G ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లతో భారత మార్కెట్లో లాంచ్ అయింది . వివో T4 అల్ట్రా 5G 12GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.42,999 తో లాంచ్ అయింది. టాప్ వేరియంట్ ధర రూ.44,999.

 

Vivo T4 Ultra 5G Sale Date And Offers

Vivo T4 Ultra 5G స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ జూన్ 18న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సేల్ సమయంలో, దాని 12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ రూ.39,999 కు లభిస్తుంది. అయితే, 12 GB RAM + 512 GB స్టోరేజ్ ధర రూ.41,999. కొనుగోలు సమయంలో EMI , బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ఫోన్ ధర గణనీయంగా తగ్గుతుంది.

 

Vivo T4 Ultra Specifications

వివో T4 అల్ట్రా 6.67-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను 1.5K రిజల్యూషన్, 5,000 నిట్స్ పీక్ లోకల్ బ్రైట్‌నెస్ స్క్రీన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వివో Funtouch OS 15 పై పని చేస్తుంది. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్‌ ఉంది. వివో T4 అల్ట్రా 7.43మి.మీ మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.

 

Vivo T4 Ultra Camer And Battery

కెమెరా, బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే.. వివో టి4 అల్ట్రాలో 50MP + 8MP + 50MP పెరిస్కోప్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్ 5500 mAh బ్యాటరీతో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

Exit mobile version
Skip to toolbar