Site icon Prime9

Vivo T4 5G: పెద్దన్న వచ్చాడు.. 7300mAh బ్యాటరీతో Vivo T4 5G.. ఆఫర్లు, ఫీచర్లు హైరేంజ్ అంతే..!

Vivo T4 5G First Sale

Vivo T4 5G First Sale

Vivo T4 5G: వివో ఇటీవల భారతదేశంలో అతిపెద్ద బ్యాటరీతో వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈరోజు ఏప్రిల్ 29న, ఈ ఫోన్ మొదటిసారిగా ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కి రానుంది. ఈ ఫోన్ సేల్ మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమైంది. ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీ ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తుంటే Vivo T4 5G మీకు ఉత్తమ ఎంపిక. ఈరోజు Vivo T4 5G మొదటి సేల్, కాబట్టి ఫోన్‌పై కొన్ని గొప్ప డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

 

Vivo T4 5G Offers
Vivo T4 5G మొదటి సేల్ ఏప్రిల్ 29న అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులను ఉపయోగించి చేసే కొనుగోళ్లపై రూ. 2,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు, పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ. 2,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా దక్కించుకోవచ్చు. కస్టమర్లు ఈ ఫోన్‌ను 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్‌తో కూడా కొనుగోలు చేయచ్చు.

 

Vivo T4 5G Features
Vivo T4 5G దాని విభాగంలో శక్తివంతమైన ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్‌లో అతిపెద్ద 7300mAh బ్యాటరీ ఉంటుంది. దీనిని 90W ఫ్లాష్‌ఛార్జ్ టెక్నాలజీ సహాయంతో కేవలం 33 నిమిషాల్లో 50శాతం ఛార్జ్ చేయచ్చు. 65 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయచ్చు.

 

Vivo T4 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌ రన్ అవుతుంది. 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్‌ ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్‌ల బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం 50MP సోని IMX882 OIS ప్రైమరీ కెమెరా, 2MP బోకె లెన్స్, డ్యూయల్ రియర్ సెటప్‌ ఉంది, సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.

 

ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్, IP65 రేటింగ్‌ను పొందింది, ఇది వాటర్, డస్ట్ నుండి రక్షణను ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 15 పై రన్ అవుతుంది. AI ఎరేస్, AI ఫోటో ఎన్‌హాన్స్, లైవ్ టెక్స్ట్, AI నోట్ అసిస్టెంట్, సూపర్ డాక్యుమెంట్స్, సర్కిల్ టు సెర్చ్ వంటి స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఎమరాల్డ్ బ్లేజ్, ఫాంటమ్ గ్రే అనే రెండు అద్భుతమైన రంగుల్లో లభిస్తుంది. వినియోగదారులు దీనిని ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్,ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల నుండి కొనుగోలు చేయచ్చు.

Exit mobile version
Skip to toolbar