Vivo X200 Series: వివో భారతదేశంలో తన ఫ్లాగ్‌షిప్ Vivo X200 సిరీస్‌ను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ ఎక్స్‌లో షేర్ చేసింది. మలేషియాలో Vivo X200 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను అధికారికంగా ప్రారంభించిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వచ్చింది.Vivo ఇప్పటికే తన ఫ్లాగ్‌షిప్ సిరీస్ X200ని గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.
ఇప్పుడు కంపెనీ Vivo X200, Vivo X200 Pro మోడళ్లను భారతదేశంలో కూడా పరిచయం చేయగలదని భావిస్తున్నారు. X200 సిరీస్ 1.5K OLED ప్యానెల్‌లు, 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఆకట్టుకునే డిస్‌ప్లేలను కలిగి ఉంది. X200 బేస్ వేరియంట్‌లో 6.67-అంగుళాల డిస్‌ప్లే ఉంది. అయితే ప్రో మోడల్ పెద్ద 6.78-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. రెండు మోడల్స్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.
ఆప్టిక్స్ పరంగా X200 సిరీస్ బలమైన ఫీచర్లను కలిగి ఉంది. స్టాండర్డ్ X200 OISతో 50MP Sony IMX921 మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP సోనీ IMX882 టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. మరోవైపు, ప్రో మోడల్ OISతో 50MP సోనీ LYT-818 మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, V3+ ఇమేజింగ్ చిప్‌తో కూడిన 200MP జీస్ APO టెలిఫోటో లెన్స్‌తో ఉంటుంది.
ఈ రెండు వివో ఫోన్లు MediaTek డైమెన్సిటీ 9400 SoC ద్వారా రన్ అవుతాయి. వీటిలో 16GB RAM+ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Funtouch OS 15ని పని చేస్తాయి. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68/IP69 రేట్ చేయబడ్డాయి. X200 5,800mAh బ్యాటరీని కలిగి ఉంది, ప్రో మోడల్ పెద్ద 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఫ్లాగ్‌షిప్ Vivo X200 సిరీస్ లాంచ్ డేట్ దగ్గర పడుతుండగా ఫోన్ గురించి యూజర్‌లలో ఉత్సాహం కూడా పెరుగుతోంది. అయితే ఈ ఫోన్ ఫీచర్లతో పాటు ధరను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. కానీ గ్లోబల్ మార్కెట్‌లో లభించే ప్రో, వెనిలా వేరియంట్‌ల ధర MYR 4,699 (సుమారు రూ. 94,180), MYR 3,599 (సుమారు రూ. 72699). ఈ ఫోన్లు Oppo ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు.. ఫైండ్ X8 ,ఫైండ్ X8 ప్రోలకు పోటీగా ఉంటాయి. ఇవి నవంబర్ 21న భారతదేశంలో విడుదలైన మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతాయి.