Vivo T3 Lite 5G Offer: Vivo ప్రియులకు బంపర్ ఆఫర్ వచ్చింది. మీరు 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో 5G మొబైల్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. Vivo T3 Lite 5G ఫోన్ ఆకర్షణీయమైన తగ్గింపుతో సేల్‌కి తీసుకొచ్చింది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్, 10 శాతం తగ్గింపు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ధర, ఆఫర్‌లు, స్పెసిఫికేషన్‌లను తెలుసుకుందాం.
Vivo T3 Lite 5G ఫోన్ ఈ ఏడాది జూన్‌లో విడుదలైంది. ఇది రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌తో వస్తుంది. మీరు వైబ్రంట్ గ్రీన్, మెజెస్టిక్ బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్‌లోని స్టైలిష్ లుక్, బాంబ్స్టిక్ కెమెరా మరియు అద్భుతమైన ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇందులో మెడిటెక్ డైమన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. అలానే ఇందులో 6.56 అంగుళాల డిస్‌ప్లే, 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.
Vivo T3 Lite 5G Phone Offers
వివో T3 లైట్ 5G ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లపై 1,000. ఫ్లాట్ తగ్గింపు, EMIపై 1,250. (10 శాతం) తగ్గింపు అందుబాటులో ఉంది. మీరు ఆఫర్‌తో 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను కేవలం రూ.9,499కి కొనుగోలు చేయచ్చు. 6GB RAM + 128GB స్టోరేజ్ ఆప్షన్ రూ. 11,499కి అందుబాటులో ఉంది.
ఈ ఫోన్‌ను 3 నెలల నో కాస్ట్ EMIతో కొనుగోలు చేయవచ్చు. రూ. 7,150 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్‌లన్నింటినీ పొందండి. ఈ మొబైల్ కంపెనీ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంది.
Vivo T3 Lite 5G Features
ఈ మొబైల్ 6.56-అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 1612 x 720 పిక్సెల్ రిజల్యూషన్, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. కంపెనీ మీడియాటెక్ డైమెన్షన్ 6300 ప్రాసెసర్‌తో Vivo T3 లైట్ 5G ఫోన్‌ను విడుదల చేసింది. గ్రాఫిక్స్ కోసం ఆర్మ్ మాలి G57 MC2 GPUని కలిగి ఉంది. ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ మొబైల్ Android 14 ఆధారిత Funtouch OS 14లో పని చేస్తుంది.
Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ కెమెరా, 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. మొబైల్ 5000mAh కెపాసిటీ బ్యాటరీతో లాంచ్ అయింది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. ఫోన్‌ను వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి IP64 రేటింగ్ ఉంది. కనెక్టివిటీ ఎంపికల విషయానికొస్తే డ్యూయల్ సిమ్ 5G, 4G, Wi-Fi, బ్లూటూత్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.