Site icon Prime9

Twitter Features: ట్విటర్లో రానున్న ఆ రెండు ఫీచర్లు.. ఎప్పటి నుంచి అంటే?

elon musk tweets readability changes

elon musk tweets readability changes

Twitter Features: ట్విటర్‌ ను కొన్నప్పటి నుంచి ఎలాన్‌ మస్క్ అందులో చాలా మార్పులు చేపట్టారు. ఈ క్రమంలో పోటీ యాప్‌లకు విభిన్నంగా ఉండటం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నారు. తాజాగా ట్విటర్ లో మరో రెండు కొత్త ఫీచర్లను వచ్చే వారంలో తీసుకురానున్నట్టు ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. సోషల్ మీడియాలో ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు.. ఆయన చేసిన ట్వీట్‌లో కొత్త ఫీచర్ల గురించి వెల్లడించారు.

 

త్వరలో రెండు ఫీచర్లు

ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్‌ చేసే వీడియోలకు 15 సెకన్ల ఫార్వార్డ్‌, బ్యాక్‌ బటన్లను కూడా యాడ్ చేయాలని మస్క్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై రియాక్ట్ అయిన మస్క్..‘ వచ్చే వారంలో పిక్‌-ఇన్‌- పిక్‌ మోడ్‌తో పాటు వీడియో ఫార్వార్డ్‌, బ్యాక్‌ బటన్లు రానున్నాయి’ అని రీట్వీట్ చేశారు. పిక్‌-ఇన్‌-పిక్‌ మోడ్‌ ఫీచర్ తో యూట్యూబ్‌ లో లానే యూజర్లు చిన్న విండోలో వీడియోను చూస్తూ.. వెబ్‌ పేజ్‌లో తమ పనిని చేసుకోవచ్చు. అదే విధంగా ఫార్వార్డ్‌, బ్యాక్‌ బటన్స్‌తో వీడియోను ముందు, వెనకకు జరుపుకుని చూసుకునే వీలు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్లు వాట్సాప్‌, యూట్యూబ్‌ లాంటి యాప్స్‌లో యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. వచ్చే వారం నుంచి ట్విటర్‌ యూజర్లకు కూడా పరిచయం కానున్నట్టు ఎలాన్ మస్క్ తెలిపారు.

 

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాం

మస్క్‌ ట్వీట్ చూసిన నెటిజన్లు ట్విటర్ లో ఈ ఫీచర్ల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నామని మస్క్ ట్వీట్ చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎట్టకేలకు వాటిని లాంచ్ చేస్తున్నందుకు థాంక్స్‌ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. గత ఏడాది ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలాన్ మస్క్‌ సీఈవోగా వ్యవహరించారు. ఇటీవలే లిండా యాకరినోను ట్విటర్‌ సీఈవోగా నియమించారు. ఆమె ప్రత్యేకంగా బిజినెస్స్‌ ఆపరేషన్స్‌పై దృష్టి పెడతారని మస్క్‌ ఇప్పటికే ప్రకటించారు. అలానే ప్రొడక్ట్‌ డిజైన్‌, కొత్త టెక్నాలజీకి సంబంధించిన వ్యవహారాలను తానే చూసుకుంటానని చెప్పారు.

 

Exit mobile version