Twitter 2FA: ట్విటర్ ఎస్‌ఎంఎస్ బేస్డ్ ‘టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్(2ఎఫ్‌ఏ)’ ఈ రోజు( మార్చి 20) నుంచి అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండదు. కేవలం ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
అయితే, ప్రత్యేకంగా 2ఎఫ్‌ఏ మాత్రమే కావాలనుకుంటే మాత్రం కుదరదు. ట్విటర్ లాగిన్‌లో అదనపు భద్రత కావాలంటే ట్విటర్ బ్లూను కూడా సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి.
దుర్వినియోగాన్ని ఆపేందుకే(Twitter 2FA)
2ఎఫ్‌ఏ ఫీచర్‌ను ఉచితంగా అందించడాన్ని నిలిపివేయనున్నట్టు ట్విటర్ ఫిబ్రవరిలోనే ప్రకటించింది. కొంతమంది ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లు కూడా తెలిపింది. అందుకే సదరు ఫీచర్ ట్విటర్ బ్లూ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ప్రత్యేక ఫీచర్‌గా ఇవ్వనున్నట్లు పేర్కొంది.
ఇప్పటికే 2ఎఫ్‌ఏ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకున్న నాన్ బ్లూ సబ్‌స్క్రైబర్లు దాన్ని డిజేబుల్ చేసుకోవాలని కోరింది. దాని కోసం 30 రోజుల సమయం ఇచ్చింది. అది మార్చి 20 తో ముగుస్తుంది.
ట్విటర్ బ్లూ సబ్‌స్క్రైబ్ కోసం
ట్విటర్ బ్లూ సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే నెలకు రూ. 900, ఏడాదికి 9,400 చెల్లించాల్సి ఉంటుంది. వెబ్ ఇంటర్‌ఫేస్ కోసం మాత్రమే అయితే నెలకు రూ. 650, సంవత్సరానికి రూ. 6,800 చెల్లించాలి.
ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే 2ఎఫ్‌ఏతో పాటు వెరిఫైడ్ చెక్‌మార్క్, సుదీర్ఘ పోస్ట్‌లు, ట్వీట్లు ఎడిట్ చేసుకోవడం, యాప్ ఐకాన్ మార్చడం.. లాం టి అదనపు ఫీచర్లను పొందేందుకు వీలు ఉంది.