iPhone 16 Offers: గ్లోబల్ టెక్ మార్కెట్లో ఎన్ని మొబైల్ కంపెనీలున్నా యాపిల్ గ్యాడ్జెట్లకు ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. అలానే వాటి డిమాండ్‌కు బ్రేక్ వేయాలని టాప్ కంపెనీలు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇది ఇప్పుడల్లా కుదిరేలా కనిపించడం లేదు. అయితే యాపిల్ వరుసగా ఆఫర్లను ప్రకటిస్తుంది. మీరు కూడా చాలా కాలంగా కొత్త ఐఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు చాలా బెస్ట్ డీల్ అవుతుంది. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ విజయ్ సేల్స్ ఐఫోన్ 16 ధరను భారీగా తగ్గించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ స్మార్ట్‌ఫోన్ డీల్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ విజయ్ సేల్స్‌లో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఐఫోన్ 16 ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఫోన్ ప్లాట్‌ఫామ్‌లో రూ. 79,900కి లిస్ట్ చేశారు. అయితే మీరు బ్యాంక్ ఆఫర్‌లతో ఫోన్‌పై అతిపెద్ద తగ్గింపును పొందచ్చు. HDFC బ్యాంక్ కార్డ్ ఆఫర్ ద్వారా మీరు ఫోన్‌పై రూ.4500 వరకు ఆదా చేసుకోవచ్చు. కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫుల్ స్వైప్‌పై నేరుగా రూ. 5000 తగ్గింపును అందిస్తోంది. అయితే మీరు IDFC FIRST బ్యాంక్ కార్డ్‌ని కలిగి ఉంటే మీరు నేరుగా మొబైల్‌పై రూ. 10,000 వరకు ఆదా చేయొచ్చు. దీని వలన ఫోన్ ధర రూ. 69,900కి తగ్గుతుంది.
అదే సమయంలో మీరు ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా వర్తింపజేస్తే ఐఫోన్ 16 ధర గణనీయంగా తగ్గుతుంది. అయితే ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అనేది మీ పాత ఫోన్ పర్ఫామెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఐఫోన్ 13 ఎక్స్‌ఛేంజ్‌పై రూ. 20 నుంచి రూ. 25 వేల వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందచ్చు. ఈ ఆఫర్లన్నింటితో iPhone 16 అతి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది.
మరోవైపు, ఫ్లిప్‌కార్ట్ కూడా ఫోన్‌పై కొన్ని ఆఫర్‌లను అందిస్తోంది. అయితే అవి అంతగా తగ్గింపును ఇవ్వడం లేదు. ఈ ఫోన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా రూ. 79,900కి జాబితా చేశారు. ఇది దీని ప్రారంభ ధర. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ద్వారా ఫోన్‌పై గరిష్టంగా 3500 రూపాయల వరకు తగ్గింపు కూడా అందుబాటులో ఉంది.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఫోన్ ధరను తగ్గించింది. ఫోన్ రూ. 77,900కి అందుబాటులో ఉంది. దాని లాంచ్ ధర కంటే కొంచెం తక్కువ. SBI క్రెడిట్ కార్డ్, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఫోన్‌లో రూ. 5000 వరకు ఆదా చేసుకోవచ్చు. అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ రెండు ప్లాట్‌ఫామ్‌లు కూడా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను అందిస్తున్నాయి.