Site icon Prime9

5G Mobile Offers: ప్రతి ఆఫర్ అవసరమేరా.. కాస్ట్‌లీ ఫోన్లు రూ.20 వేలకే.. పండగ చేస్కోండి!

5G Mobile Offers

5G Mobile Offers: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. దీపావళి సేల్‌లో భాగంగా 5జీ స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది. అలానే అనేక గ్యాడ్జెట్లపై బంపర్ తగ్గింపులను అందిస్తోంది. రూ.20 వేల లోపే ఈ సేల్‌లో చాలా ఖరీదైన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూ.20వేల బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్లతో వస్తున్న అలాంటి మూడు ఫోన్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

Realme P2 Pro 5G
మొదటగా ఈ జాబితాలో Realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్ గురించి మాట్లాడుకుందాం. ఈ రియల్‌మి P2 ప్రో 5G లుక్స్ పరంగా చాలా ఖరీదైన ఫోన్‌లతో పోటీపడుతుంది. ఇందులో కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉంది. ఫోన్‌లో 8 జీబీ ర్యామ్+ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. కెమెరా గురించి చెప్పాలంటే ఇది 50MP + 8MP  బ్యాక్, 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

బ్యాటరీ పరంగా ఫోన్‌లో 5200 mAh బ్యాటరీ ఉంది. ఇది చాలా శక్తివంతమైనది. అలానే ఫోన్‌లో 7s Gen2 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం ఎటువంటి ఆఫర్ లేకుండా రూ. 21,999కి అందుబాటులో ఉంది. అయితే SBI డెబిట్ కార్డ్ ద్వారా మీరు దీనిపై రూ. 2000 అదనపు తగ్గింపును పొందవచ్చు. దీని ధర రూ. 20 వేల కంటే తక్కువగా ఉంటుంది.

Nothing Phone (2a) 5G
జాబితాలోని రెండవ ఫోన్ చాలా ప్రత్యేకమైన డిజైన్‌తో వస్తుంది. దాని వెనుక ఐకానిక్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను చూడవచ్చు. నథింగ్స్ ఫోన్‌ల వెనుక ప్యానెల్ వాటిని అన్ని ఇతర కంపెనీల కంటే భిన్నంగా చేస్తుంది. 8 జీబీ ర్యామ్+ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,  6.7 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఈ ఫోన్‌ను ఫీచర్ల పరంగా కూడా చాలా ప్రత్యేకమైనదిగా చేస్తాయి.

కెమెరా గురించి మాట్లాడితే ఫోన్‌లో 50MP (OIS) + 50MP బ్యాక్,  32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది మాత్రమే కాదు ఫోన్ 5000 mAh బ్యాటరీ, శక్తివంతమైన Dimensity 7200 Pro ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఫోన్ ధర రూ. 21,999. అయితే మీరు SBI క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్‌తో రూ. 1750 తగ్గింపుతో కూడా కొనుగోలు చేయవచ్చు.

POCO X6 Pro 5G
ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో POCO X6 Pro 5G‌పై కూడా బంపర్ డిస్కౌంట్ లభిస్తుంది. 20 వేల కంటే తక్కువ ధరతో ఫోన్ ఆర్డర్ చేయచ్చు. ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,  6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. కెమెరా పరంగా ఈ ఫోన్ చాలా అద్భుతంగా ఉంది. దీనిలో 64MP ప్రైమరీ కెమెరా, 8MP + 2MP ట్రిపుల్ కెమెరా ఉన్నాయి.

అలాగే ఇది 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీ, డైమెన్సిటీ D8300 అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ ధర రూ.19,999 మాత్రమే.

Exit mobile version