Site icon Prime9

Best Phones Under 5000: ఫుల్ క్రేజ్ ఉన్న మొబైల్స్.. రూ.5 వేలకే బుక్ చేయచ్చు.. ఏది బెస్ట్ అంటే?

Best Phones Under 5000

Best Phones Under 5000

Best Phones Under 5000: ప్రీమియం ఫోన్లకే కాదు.. బడ్జెట్ ఫోన్లకు కూడా మార్కెట్‌లో ఫుల్ క్రేజ్  ఉంది. మొబైల్ ప్రియులు అందరూ హై ఎండ్ ఫోన్ల వైపు పరుగులు పెడుతున్న ఈ బడ్జెట్ ఫోన్లు ఇంకా యూజర్లను అట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి. అందులోనూ రూ.5 వేలు బడ్జెట్‌లోనూ అద్భుతమైన ఫీచర్లతో ఫోన్లు ఆకట్టుకుంటున్నాయి. ఆండ్రాయిడ్‌లో రన్ అయ్యే ఈ ఫోన్లు స్పీడ్, స్టెబిలిటీ పర్ఫామెన్స్ చాలా బాగుంటాయి.  ఇప్పుడు ఈ  జాబితాలో ఉన్న బెస్ట్ ఫోన్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

JioPhone Next
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.4,499 మాత్రమే.అమెజాన్‌,  ఇతర ఆఫ్‌లైన్ స్టోర్ల నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ కొనచ్చు. ఫోన్ 5.45 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 720 x 1440 పిక్సెల్‌లు. ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కోర్, 1.3 GHz అడ్రినో 308 GPU, 2 GB RAM, డిఫాల్ట్ మెమరీ 32 GB స్టోరేజ్ కలిగి ఉంది. దీనిని 512GB వరకు పెంచుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం 1080p మెయిన్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. పవర్ కోసం Li-Po 3500 mAh బ్యాటరీ ఉంది.

Itel A23 Pro
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 4,015. అమెజాన్, ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. దీనిలో 5.0 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. దీని రిజల్యూషన్ 480 x 854 పిక్సెల్స్. ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కోర్ 1.4 GHz, Mali-T820 MP1 GPU విత్ కార్టెక్స్ A53 ప్రాసెసర్ ఉంటుంది. 1 GB RAM, డిఫాల్ట్ మెమరీ 8 GB స్టోరేజ్ ఉంటుంది. దీనిని 32 GB వరకు పెంచుకోవచ్చు. కెమెరా గురించి మాట్లాడితే ఫోన్‌లో 0.3 MP కెమెరాతో కూడిన సెకండరీ సెల్ఫీ కెమెరా ఉంది. Li-Po 2400 mAh బ్యాటరీ ఉంది.

Infinix Smart 8 HD
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 6,399. అమెజాన్, ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ HD 720 x 1612 పిక్సెల్స్, HD+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది ఆక్టా-కోర్, 3 ర్యామ్ + 3GB వర్చువల్ ర్యామ్ (LPDDR4X)తో ARM Mali G57 MP1 GPUని కలిగి ఉంది. ఇది డిఫాల్ట్ మెమరీ క 64 GB (UFS 2.2) స్టోరేజ్. దీనిని 2 TB వరకు విస్తరించవచ్చు. ఫోన్ మెయిన్ కెమెరా 1080 30fps, 8 MP సెల్ఫీ కెమెరా సెకండరీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. నాన్-రిమూవబుల్ Li-Ion 5000 mAh బ్యాటరీ ఉంది.

Exit mobile version