iPhone 15 Pro Offer: ఆఫర్ల పండుగ.. ఐఫోన్‌పై రూ.32,900 డిస్కౌంట్.. పోతే మళ్లీ రాదు..!

iPhone 15 Pro Offer: టెక్ ప్రపంచంలో ఐఫోన్లకు ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. మనలో చాలా మంది లైఫ్‌లో ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనుకుంటారు. అయితే వీటి ధర కాస్త ఎక్కువగా ఉండటంతో డిస్కౌంట్లు, ఆఫర్ల కోసం చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. ఐఫోన్ 15 ప్రోపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్‌ను అమెజాన్ రూ.1,34,900కి లాంచ్ చేేసింది. కానీ ఇప్పుడు ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా కేవలం రూ.1,02,190కి అందుబాటులో ఉంది. ఈ డీల్ గురించి వివరంగా తెలుసుకుందాం.

iPhone 15 Pro Discount
ఐఫోన్ 15 ప్రో ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో రూ. 1,02,190కి అందుబాటులో ఉంది. ఇది ఫోన్ లాంచ్ ధర కంటే చాలా తక్కువ. ఇది మాత్రమే కాదు, ఫోన్‌పై ప్రత్యేక బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ EMI ద్వారా ఫోన్‌పై రూ.4500 వరకు తగ్గింపు లభిస్తుంది.

అదే సమయంలో YES బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ద్వారా ఫోన్‌పై రూ. 2500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపు ఆఫర్‌తో ఫోన్ ధర రూ. 1 లక్ష కంటే తక్కువగా ఉంటుది. అయితే ఈ ఐఫోన్‌పై ఎటువంటి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అందుబాటులో లేదు.

iPhone 15 Pro Features
ఐఫోన్ 15 ప్రో ఏరోస్పేస్-గ్రేడ్ టైటానియంతో డిజైన్ చేశారు.  బెటర్ డూరబిలిటీ కోసం మాట్టే-గ్లాస్ బ్యాక్, సిరామిక్ షీల్డ్ ఫ్రంట్‌తో రూపొందించారు. ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే,  ప్రోమోషన్ టెక్నాలజీతో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. డైనమిక్ ఐలాండ్ ఫీచర్ హెచ్చరికలు, స్పెషల్ నోటిఫికేషన్‌లను అందిస్తుంది. అయితే ఎల్లప్పుడూ ఆన్ డిస్‌ప్లే ఇంట్రాక్షన్ అవసరం లేకుండా లాక్ స్క్రీన్‌ను కనిపించేలా చేస్తుంది.

ఫోన్‌లో A17 ప్రో చిప్ ఉంది, ఇది ప్రో-క్లాస్ GPUతో లీనమయ్యే మొబైల్ గేమింగ్‌లో సహాయపడుతుంది. అలాగే, మీరు రోజంతా ఉండే పవర్ ఫుల్ బ్యాటరీ లైఫ్ పొందుతారు. మొబైల్ ఏడు ప్రో లెన్స్‌లతో ఉంటుంది. ఇది హై-రిజల్యూషన్ ఫోటోలను క్యాప్చర్ చేయగల 48MP ప్రైమరీ కెమెరాను ఉపయోగిస్తుంది. ఇది దూరం నుండి కూడా షార్ప్ క్లోజప్ షాట్‌లను తీయగలదు. ఐఫోన్ 15 ప్రోలోని యాక్షన్ బటన్ సైలెంట్ మోడ్, కెమెరా, వాయిస్ మెమోలు, ఇతర ఇష్టమైన ఫీచర్‌లకు కస్టమైజ్ చేసే షార్ట్‌కట్‌గా పనిచేస్తుంది.