Site icon Prime9

Top 3 Mobiles: దడ పుట్టించే ఫోన్స్.. సెకండ్స్‌లో బ్యాటరీ ఫుల్.. స్పీడ్ చూస్తే తట్టుకోలేరు!

Top 3 Mobiles

Top 3 Mobiles

Top 3 Mobiles: కాలంతో పాటు స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఛార్జింగ్ టెక్నాలజీలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీని కారణంగా ఒకప్పుడు గంటల కొద్ది ఛార్జ్‌లో ఉంచిన ఫుళ్లవని బ్యాటరీ ఇప్పడు క్షణాల్లో 100 శాతానికి వచ్చేస్తుంది. చాలా తక్కువ సమయంలోనే మొబైల్ ఫోన్ ఛార్జ్ అవుతుంది. వివిధ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఫాస్ల్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఫోన్లను తీసుకొస్తున్నాయి. అయితే మీరు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్లను కొనాలని చూస్తుంటే 120వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే మూడు బెస్ట్ ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.

Redmi Note 13 Pro+
12 GB RAM+ 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.31,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల 1.5K 3D కర్వ్డ్ ఆమ్లోడ్ డిస్‌ప్లేను చూస్తారు. ఈ ఫోన్ MediaTek Dimension 7200 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 200 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయికంపెనీ ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది.

iQOO Neo9 Pro 5G
8 GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.36,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 5160mAh బ్యాటరీ ఉంది. ఇది  120W ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జింగ్‌తో ఫోన్ 11 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఫోన్ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఫోన్‌లో 6.78 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ డిస్‌ప్లే పీక్ బ్రైట్నెస్ 3000 నిట్స్. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది.

Realme GT 6T 5G
ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ. 32,998కి అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్‌లో 8 GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో 5500mAh బ్యాటరీని పొందుతారు. ఈ బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ప్రాసెసర్‌గా కంపెనీ ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌సెట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల LTPO కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది.

ఈ డిస్‌ప్లే పీక్ బ్రైట్నెస్ 6000 నిట్స్, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లే ప్రొటక్షన్ కోసం ఫోన్‌లో గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ని కూడా ఉంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ అందించారు.  ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ Android 14 ఆధారంగా Realme UI 5.0 పై పని చేస్తుంది.

Exit mobile version