Best 5G Smartphones Under 10K: దేశవ్యాప్తంగా 5జీ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో కూడా 5జీ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్ ప్రియులు 4జీ ఫోన్లను పక్కన పెట్టేసి వేగవంతమైన నెట్వర్క్ కోసం 5జీ ఫోన్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్ ధరలు ప్రారంభంలో చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు తక్కువ ధరకే లభిస్తున్నాయి.
అలానే బెస్ట్ ఫీచర్లను ఆఫర్ చేస్తున్నాయి. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో సరసమైన, మంచి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఇవి చాలా ఉపయోగంగా ఉంటాయి. ఇందులో సామ్‌సంగ్, మోటరోలా, పోకో, రియల్‌మి వంటి బ్రాండ్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే మీరు కూడా 5జీ మొబైల్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలనే ప్లాన్‌లో ఉంటే రూ.10 వేల బడ్జెట్‌లో మార్కెట్లో ఉన్న బెస్ట్ మొబైల్స్ ఏంటి? వాటిలో ఎలాంటి ఫీచర్లు ఉంటాయి? తదితర వివరాలు తెలుసుకుందాం.
Motorola G45
ఈ మోటరోలా ఫోన్‌ను రూ. 10 వేల కంటే తక్కువకు కొనుగోలు చేయడం మంచి నిర్ణయం. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 9,999 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది 6.5 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది, ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఉన్నాయి.
Samsung Galaxy A14 5G
ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల PLS LCD డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ మెడిటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్, 50MP మెయిన్ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా, 5,000 mAh బ్యాటరీ ఉన్నాయి.
Poco M6 5G
ఈ పోకో స్మార్ట్‌ఫోన్‌ను రూ. 10 వేల లోపు బలమైన ఫీచర్లతో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇచ్చే 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 50MP కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ ఉన్నాయి.
Realme Narzo N63
ఈ రియల్‌మి ఫోన్‌ను అమెజాన్ నుంచి కేవలం 8,499 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఉన్నాయి.