Best AI Powered Mobiles: టెక్ ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుంది. మొబైల్ ప్రియులకు అభిప్రాయాలు, అభిరుచులకు అనుగుణంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను వేగవంతం చేశాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు ధర, ఫీచర్లపై ఫోకస్ చేస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లపై అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ టెక్నాలజీని అందిస్తున్నాయి. ఇది స్మార్ట్‌ఫోన్‌లలో హై-ఎండ్ ఫీచర్లను అందిస్తోంది. ఆకట్టుకునే కెమెరాలు, మంచి బ్యాటరీ లైఫ్, బెస్ట్ పర్ఫార్మెన్స్‌కి పొందుతారు. ఈ నేపథ్యంలో రూ. 30,000 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ AI- పవర్డ్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.
Nothing Phone 2a Plus
నథింగ్ నుండి వచ్చిన ఈ ఫోన్ AI-ఆధారిత స్మార్ట్‌ఫోన్. ఇది MediaTek Dimensity 7350 Pro చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది. ఫోన్ 8 GB RAMతో వేగవంతమైన పనితీరును అందిస్తుంది. దీనిలో ౌ120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD + AMOLED డిస్‌ప్లేను చూస్తారు.
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. దీన్ని పవర్ చేయడానికి, 5000mAh బ్యాటరీని ఇందులో చేర్చారు.
Realme GT 6T
ఇది రియల్‌మి పవర్ ఫుల్ బడ్జెట్ ఫోన్. ఇది స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. దీనిలో 6.78 అంగుళాల FHD + LTPO AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.
ఇది కాకుండా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్‌ని పవర్ చేయడానికి కంపెనీ ఇందులో 5,500mAh బ్యాటరీని చేర్చింది.
Motorola Edge 50 Pro 5G
ఈ మోటరోలా ఫోన్ కూడా శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్. ఇది స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్, 8 GB RAMతో వేగవంతమైన, మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది. దీనిలో మీరు 6.7 అంగుళాల FHD + P-OLED డిస్‌ప్లేను చూస్తారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో మృదువైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెకండరీ, 10 మెగాపిక్సెల్ మూడో కెమెరా ఉన్నాయి. అయితే సెల్ఫీ కోసం ఇది 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ పవర్ చేయడానికి కంపెనీ ఇందులో 4500mAh వరకు బ్యాటరీని చేర్చింది.