Site icon Prime9

Jiostar: ఓటీటీలో సంచలనం.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో విలీనం.. కొత్త డొమైన్ ఇదిగో..!

Jiostar

Jiostar

Jiostar: రిలయన్స్ జియో – స్టార్ ఇండియా విలీనం చివరి దశకు చేరుకుంది. ఈ విలీనం తర్వాత JioCinema, Disney + Hotstar OTT ప్లాట్‌ఫామ్‌లు ఒకటిగా మారే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని కంపెనీ ప్రస్తుతం పంచుకోలేదు. అయితే ఈ విషయాన్ని Jio, Hotstarకి సంబంధించిన అనేక వెబ్ డొమైన్లు వెలుగులోకి వచ్చాయి.

నివేదిక ప్రకారం.. కంపెనీ Jiostar.com పేరుతో కొత్త డొమైన్‌ను లైవ్ చేసింది. మీరు ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయగానే Jio Star Coming Soon కనిపిస్తుంది. నవంబర్ 14 నుండి ఈ డొమైన్‌లో స్ట్రీమింగ్ సర్వీస్ ప్రారంభమవుతుందని ఊహాగానాలు ఉన్నాయి. ఈ రెండు ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లు ఈ వెబ్‌సైట్ ద్వారా యాక్సెస్ చేయచ్చని చాలా నివేదికలు పేర్కొన్నాయి.

తాజా నివేదికల ప్రకారం రిలయన్స్ జియో IPL, ISL, ప్రో కబడ్డీ మొదలైన అన్ని క్రీడా ఈవెంట్‌లను Disney + Hotstar యాప్ ద్వారా ప్రసారం చేస్తుంది. అదే సమయంలో అన్ని వెబ్ సిరీస్‌లు, టీవీ సీరియల్స్, సినిమాలు మొదలైనవి JioCinema ద్వారా ప్రసారం చేస్తుంది. నివేదిక ప్రకారం, స్పోర్ట్స్ ఈవెంట్‌ల ప్రత్యక్ష ప్రసారం కోసం డిస్నీ+ హాట్‌స్టార్ మెరుగైన మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్లాట్‌ఫామ్‌ను కేవలం స్పోర్ట్స్ ఈవెంట్‌లకు మాత్రమే ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది.

అనేక సంవత్సరాలుగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రసారం చేస్తుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇప్పటికీ అన్ని ICC ఈవెంట్‌ల స్ట్రీమింగ్ హక్కులను కలిగి ఉంది. ఇటీవల ఒక నివేదికలో ఈ రెండు OTT ప్లాట్‌ఫామ్‌లను JioHostar పేరుతో విలీనం చేయనున్నట్లు చెప్తున్నారు. ఈ విలీనాన్ని దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీకి చెందిన యాప్ డెవలపర్ ఈ డొమైన్‌ను కొనుగోలు చేసి వేలంలో ఉంచారు. ఈ డొమైన్‌ను వేలం వేయగా వచ్చిన డబ్బును తన ఉన్నత చదువుల కోసం ఉపయోగించబోతున్నాడు.

దీని తర్వాత ఈ డొమైన్‌ను ఇద్దరు దుబాయ్ నివాసితులు కొనుగోలు చేశారు.  దానిని కంపెనీకి ఉచితంగా ఇవ్వాలని పేర్కొన్నారు. ఇటీవల జియో, హాట్‌స్టార్ డొమైన్‌లకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వస్తున్నాయి. JioStar పేరుతో కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించిన తర్వాత Jio ఇప్పుడు ఈ డొమైన్ ద్వారా తన స్ట్రీమింగ్ సేవను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ChatGPTని తయారు చేస్తున్న OpenAI, Chat.com డొమైన్ కోసం రూ. 120 కోట్లకు పైగా ఖర్చు చేసింది.

Exit mobile version