Site icon Prime9

Redmi A4 5G First Sale: ఈరోజే రెడ్‌మి A4 5జీ ఫస్ట్ సేల్.. రూ. 8,499లకే స్టన్నింగ్ ఫీచర్స్.. ప్రీమియం హలో గ్లాస్ డిజైన్‌తో వస్తుంది..!

Redmi A4 5G First Sale

Redmi A4 5G First Sale

Redmi A4 5G First Sale: దేశంలోనే అత్యంత చౌకైన 5G స్మార్ట్‌ఫోన్ Redmi A4 5G. ఇది గత వారం లాంచ్ అయింది, మొదటి సారిగా సేల్‌కి వచ్చింది. మీరు బడ్జెట్ సెగ్మెంట్‌లో 5జీ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఇది చాలా మంచి ఎంపిక. ఈ స్మార్ట్‌ఫోన్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ కామర్స్‌ సైట్ అమెజాన్‌లో సేల్‌కి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జెన్ 2 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ బడ్జెట్ ఫోన్ ప్రీమియం హలో గ్లాస్ శాండవిచ్ డిజైన్‌తో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.9500 కంటే తక్కువగా ఉంటుంది. ఫోన్ ధర, ఆఫర్లు, ఫీచర్లు తదితర వివరాల గురించి తెలుసుకుందాం.

Redmi A4 5G Price And Offers
ఈ రెడ్‌మి A4 5జీ స్మార్ట్‌ఫోన్ బేస్ 4 GB RAM + 64 GB స్టోరేజ్ వేరియంట్‌ను మొదటి సేల్‌లో రూ. 8,499 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు ఫోన్ రెండవ వేరియంట్ 4 GB RAM + 128 GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇది 9,499 రూపాయలకు అందుబాటులో ఉంటుంది.

ఈ బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ స్పార్కిల్ పర్పుల్, స్టార్రీ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఫోన్‌లో కొన్ని బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. వాటి గురించి సమాచారం సేల్ ప్రారంభమైనప్పుడు అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్ బెనిఫిట్స్ పొందడం ద్వారా మీరు ఈ ఫోన్‌ను మరింత చౌకగా కొనుగోలు చేయగలుగుతారు.

Redmi A4 5G Features
స్మార్ట్‌ఫోన్ 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 1640 X 720 పిక్సెల్‌లు, ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ Redmi ఫోన్ Adreno GPUతో Qualcomm Snapdragon 4s Gen 2 చిప్‌సెట్‌తో వస్తుంది. Redmi  5G స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారంగా HyperOS కస్టమ్ స్కిన్‌పై నడుస్తుంది.

కెమెరా గురించి మాట్లాడితే ఈ Redmi A4 5G స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీనితో పాటు, ఫోన్‌లో సెకండరీ కెమెరా LED ఫ్లాష్‌తో అందించారు.సెల్ఫీ కోసం ఫోన్‌లో 5MP కెమెరా ఉంది. ఈ ఫోన్ 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. Xiaomi 2 సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లను, 4 సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లను విడుదల చేస్తుంది. దీనితో పాటు, 3.5mm ఆడియో పోర్ట్ కూడా ఫోన్‌లో అందుబాటులో ఉంది.

Exit mobile version