Site icon Prime9

Realme GT7 Pro: రియల్‌మి జీటీ7 ప్రో వచ్చేస్తోంది.. ఇలాంటి ఫీచర్లే కదా కావాల్సింది.. లాంచ్ అయితే తోపే..!

Realme GT 7 Pro

Realme GT 7 Pro

Realme GT7 Pro: స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి తన బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. ఇది Realme GT7 Pro పేరుతో మార్కెట్‌లో సందడి చేయనుంది. అయితే ఇప్పటికే ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. నవంబర్ 18 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ నవంబర్ 26న మధ్యాహ్నం 1 గంటకు లాంచ్ చేస్తున్నట్లు బ్రాండ్ తెలిపింది. దీని తర్వాత Realme GT7 Pro ఫోన్‌ను realme.com నుంచి రూ.1000 టోకెన్ అమోంట్‌గా చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

Realme GT 7 Pro Offers
Realme GT 7 Pro ఫోన్‌ను ప్రీ-బుకింగ్ చేస్తే మీకు రూ. 3000 బ్యాంక్ తగ్గింపు లభిస్తుంది. మీరు 12 నెలల నో కాస్ట్ EMI, 1 సంవత్సరం స్క్రీన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్, 1 సంవత్సరం పొడిగించిన వారంటీని పొందుతారు. అయితే ఆఫ్‌లైన్ మోడ్‌లో రూ. 2000తో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో ప్రీ-బుకింగ్ చేసినప్పటికీ మీరు రూ. 3000 బ్యాంక్ డిస్కౌంట్, 12 నెలల నో కాస్ట్ EMI, 24 నెలల నెలవారీ వాయిదా ఎంపికను పొందుతారు. దీనితో పాటు, 1 సంవత్సరం పొడిగించిన వారంటీ అందుబాటులో ఉంటుంది.

Realme GT 7 Pro Features
రియల్‌మి జీటీ 7 ప్రో కెమెరా సెటప్ చాలా ప్రత్యేకమైనది. ఇది 50MP సోనీ IMX882 టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది, ఇది 3x ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా  50MP సోనీ IMX906 ప్రైమరీ కెమెరా, 8MP వైడ్ యాంగిల్ లెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. విశేషమేమిటంటే ఇందులో నీటి అడుగున ఫోటోగ్రఫీ మోడ్ కూడా ఉంది.

దీని ద్వారా వినియోగదారులు ఎటువంటి కేసు లేకుండా నీటిలో ఫోటోలు సులభంగా తీయొచ్చు. ఇది IP69 రేటింగ్‌తో వస్తుంది. 2 మీటర్ల లోతైన నీటిలో 30 నిమిషాల పాటు ఉంటుందని కంపెనీ పేర్కొంది. Realme నుండి వచ్చిన ఈ ఫోన్‌లో 6.78-అంగుళాల LTPO ఎకో OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 6000 నిట్‌ల వరకు పీక్ బ్రైట్‌నెస్‌కి సపోర్ట్ చేస్తుంది. పవర్ కోసం ఫోన్‌లో 6500mAh బ్యాటరీ,  120W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి.

Exit mobile version