Site icon Prime9

Oppo Find N5 Launch: పూనకాలు లోడిండ్.. ఒప్పో నుంచి వరల్డ్ స్లిమ్మెస్ట్ ఫోన్.. కలలో కూడా అనుకోలేదు..!

Oppo Find N5 Launch

Oppo Find N5 Launch: ఒప్పో ఫైండ్ ఎన్5 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ అవుతుంది. ఒప్పో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్ కావచ్చు. కంపెనీ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పీట్ లా స్వయంగా ఈ సమాచారాన్ని పంచుకున్నారు. పీట్ లౌ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్)లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. దీనిలో ఈ ఫోల్డబుల్ ఫోన్ మందం పెన్సిల్‌తో సమానంగా ఉన్నట్లు చూపారు. పీట్ లౌ విడుదల చేసిన పోస్టర్‌లో ఫోన్ మందాన్ని పెన్సిల్‌తో పోల్చారు.

కంపెనీ మునుపటి ఫోల్డబుల్ ఫోన్ Find X3 మందం 11.7mm. నివేదిక ప్రకారం, రాబోయే ఫోల్డబుల్ ఫోన్ మందం 7 నుండి 8 మిమీ వరకు ఉంటుంది. ఒప్పో ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఇటీవల అనేక ధృవీకరణ వెబ్‌సైట్‌లలో కనిపించింది. ఇటీవల విడుదల చేసిన హానర్ మ్యాజిక్ V3 9.2mm మందం కలిగి ఉంది. ఇప్పటి వరకు అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్. ఒపెన్ చేసిన్పుడు హానర్ ఫోన్ మందం 4 మిమీ అవుతుంది.

Oppo Find N5 Features
ఒప్పో ఫైండ్ ఎన్5 ఇటీవల వెల్లడించిన ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ ఫోన్ 6,000mAh శక్తివంతమైన బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్‌లో ఫాస్ట్ వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ని ఇందులో ఇవ్వవచ్చు. ఇది కాకుండా, ఫోన్‌లో IPX8 స్ప్లాష్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కూడా అందించవచ్చు. అల్ట్రా స్లిమ్ డిజైన్‌తో కూడిన ఈ ఫోల్డబుల్ ఫోన్ దాని మునుపటి వెర్షన్‌తో పోలిస్తే అనేక వినూత్న ఫీచర్లను సపోర్ట్ చేయగలదు. ఇది కాకుండా, ఈ ఫోన్ AI ఫీచర్లతో లాంచ్ అవుతుంది.

ప్రస్తుతం ఒప్పో రాబోయే ఫోల్డబుల్ ఫోన్ కెమెరా ఫీచర్ల గురించి ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. ఇందులో కూడా గతేడాది లాంచ్ చేసిన ఫైండ్ ఎన్3 లాగా సర్క్యులర్ రింగ్ డిజైన్ ఉన్న కెమెరా ఇవ్వొచ్చు. మడతపెట్టిన తర్వాత, దాని వెనుక ప్యానెల్ OnePlus 13 లాగా కనిపిస్తుంది. ఫోన్ ఫోల్డబుల్ స్క్రీన్ కోసం కొత్తగా డిజైన్ చేయనుంది ఒప్పో.

Exit mobile version