Site icon Prime9

Nothing Phone 3: వావ్ ఇది ఐఫోనా.. యాక్షన్ బటన్‌తో నథింగ్ సరికొత్త ఫోన్.. ఫీచర్స్ లీక్..!

Nothing Phone 3

Nothing Phone 3

Nothing Phone 3: లండన్‌కు చెందిన ప్రముఖ టెక్ బ్రాండ్ నథింగ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతుంది. సరికొత్త టెక్నాలజీ, ఆవిష్కరణలతో అందరి దృష్టి ఆకర్షిస్తుంది. అయితే తాజాగా కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. నథింగ్ ఫోన్ (3) పేరుతో ఇది సందడి చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌తో సరికొత్త ఆండ్రాయిడ్ 15తో వస్తుందని భావిస్తున్నారు. ఈ సమాచారం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఇది దాని గీక్‌బెంచ్ ఫోటోను వెల్లడించింది. రాబోయే నథింగ్ ఫోన్ (3) స్మార్ట్‌ఫోన్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

రాబోయే నథింగ్ ఫోన్ (3) స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది.  ఈ ఫోన్ మోడల్ నంబర్ A059ని కలిగి ఉంది. ఈ మోడల్ నథింగ్ ఫోన్ (నథింగ్ ఫోన్ 3) అని తెలుస్తోంది. ఇది NothingOS 3.0 కస్టమ్ స్కిన్ ఆధారంగా ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుందని లిస్టింగ్ నిర్ధారిస్తుంది.

Nothing Phone (3) Processor
నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌తో 8GB వరకు ర్యామ్ ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న నథింగ్ ఫోన్ (2) స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్‌తో కూడిన హై-ఎండ్ గ్యాడ్జెట్ కాబట్టి, ఈ మూడవ వేరియంట్ చౌకైన ప్రాసెసర్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. అలాగే కొన్ని నెలల క్రితం A059, A059P అనే IMEI డేటాబేస్‌లో రెండు మిస్టీరియస్ నథింగ్ ఫోన్‌లు కనిపించాయి. రెండవది మరింత పవర్ ఫుల్ ప్రో వేరియంట్.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు.. రాబోయే నథింగ్ ఫోన్ (3) స్మార్ట్‌ఫోన్ 2025 నాటిని విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో iPhone 16 Pro వంటి యాక్షన్ బటన్ కూడా ఉండవచ్చు. ఈ ఫోన్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.  ఈ ప్రాసెసర్‌తో కంపెనీ సింగిల్ కోర్ టెస్ట్‌లో 1,149 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్‌లో 2,813 పాయింట్లు సాధించింది.

నథింగ్ ఫోన్ 3 ప్లస్‌క హిసుయాన్ అనే కోడ్‌నేమ్‌తో వస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్, 6.7-అంగుళాల డిస్‌ప్లే ఉండాయి. నివేదిక ప్రకారం ఇది నథింగ్ ఫోన్ 3 ప్రో వేరియంట్‌గా రావచ్చు. ఫోన్ 3 బేస్ వేరియంట్ ధర దాదాపు రూ. 50,500. అయితే ప్రో వేరియంట్ ధర రూ. 58,900.

Exit mobile version