Flipkart Big Saving Days: బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ఇప్పుడు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతుంది. ఇందులో ఎంపిక చేసిన మొబైల్‌లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. మోటరోలా G85 5జీ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ బిగ్ సేవింగ్స్ డే సేల్‌లో అందుబాటులో ఉంది. 14 శాతం తగ్గింపు ధరతో కొనుగోలు చేయచ్చు. ఇప్పుడు కస్టమర్లు ఈ ఫోన్ 8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 17,999కి దక్కించుకోవచ్చు. అందులోనూ Moto G85 5G స్మార్ట్‌ఫోన్‌పై గణనీయమైన తగ్గింపు లభించడంతో కొత్త ఫోన్ కొనాలి అనుకున్న కస్టమర్లు వావ్ అనేలా ఉన్నారు.
అలాగే ఈ ఫోన్ Snapdragon 8 Gen 3 SoC ప్రాసెసర్ పవర్‌తో పని చేస్తుంది. ఇది కోబాల్ట్ బ్లూ, అర్బన్ గ్రే, ఆలివ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరా 32 మెగా పిక్సెల్ సెన్సార్ కెపాసిటీని కలిగి ఉంది. Moto G85 5G ఫోన్‌లో ఎలాంటి ఇతర ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం.
Moto G85 5G Features And Specifications
మోటరోలా G85 5G స్మార్ట్‌ఫోన్ 2712 × 1220 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌కు సపోర్ట్ ఇచ్చే 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనితో పాటు ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను పొందింది. డిస్‌ప్లే 1600 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ కూడా చేస్తుంది. మొబైల్ కర్వ్ డిస్‌ప్లే నిర్మాణాన్ని కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 5 కూడా ఉంది.
Moto G85 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలానే ఆండ్రాయిడ్ 14 OS ద్వారా సపోర్ట్ ఇస్తుంది. ఈ మొబైల్ 8GB RAM + 128GB +12GB RAM + 256GB స్టోరేజ్‌ని కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీని ప్రైమరీ కెమెరా 50-మెగాపిక్సెల్ సెన్సార్‌తో ఉంటుంది. సెకండరీ కెమెరా 8-మెగాపిక్సెల్ సెన్సార్‌తో ఉంటుంది. ముందు భాగంలో 32 మెగా పిక్సెల్ సెన్సార్ సెల్ఫీ కెమెరా అందించారు.
Moto G85 5G స్మార్ట్‌ఫోన్ 33W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా ఇది 4G, 5G, VoLTE, Vo5G, బ్లూటూత్ v5.3, WiFi, NFC, USB-C v3.2 ఎంపికలను పొందుతుంది. వీటితో పాటు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మాస్ ఆప్షన్స్ ఉన్నాయి.