Heavy Discount: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ జరుగుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై ఉత్తమమైన ఆఫర్లను అందిస్తోంది. అలానే ఎంపిక చేసిక మొబైల్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు, డీల్స్ ప్రకటించింది. ఇందులో భాగంగానే ప్లాట్‌ఫామ్ Motorola Edge 50 Neoపై అత్యుత్తమ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 8జీబీ ర్యామ్+256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.22,999. అలానే సేల్‌లో ఈ ఫోన్‌ను రూ. 2500 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయొచ్చు. ఈ డిస్కౌంట్ పొందడానికి మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎమ్ఐ ట్రాన్జాక్షన్ చేయాలి.
Moto Edge 50 Neo Offers
అంతేకాకుండా మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు ఈ ఫోన్ ధరను మరింత తగ్గించొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్, ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఈ సేల్ నవంబర్ 29న ముగుస్తుంది.
Moto Edge 50 Neo Features And Specifications
కంపెనీ ఈ ఫోన్‌లో 6.4 అంగుళాల ఫ్లాట్ LTPO పోల్డ్ డిస్‌ప్లేను అందిస్తోంది. 1.5K రిజల్యూషన్‌తో ఈ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz. ఫోన్‌లో అందిస్తున్న ఈ డిస్‌ప్లేలో మీరు 3000 నిట్‌ల పీక్ బ్రైట్నెస్ రేంజ్ చూడచ్చు. డిస్‌ప్లే ప్రొటక్షన్ కోసం ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని అందిస్తోంది. ఫోన్ 8 GB RAM +256 GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. కంపెనీ ఫోన్‌లో డైమెన్షన్ 7300 చిప్‌సెట్‌ను ఆఫర్ చేస్తోంది.
చివరగా ఫోన్ కెమెరా డిపార్ట్‌మెంట్ విషయానికి వస్తే.. ఫోన్ వెనుక భాగంలో ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌తో కూడిన మూడు కెమెరాలు అందించారు. వీటిలో 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫోన్ మెయిన్ కెమెరా OIS-టెలిఫోటో కెమెరా 3x ఆప్టికల్ జూమ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూడచ్చు. ఫోన్‌ను పవర్ చేయడానికి 4310mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 68 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. OS గురించి మాట్లాడితే ఫోన్ Android 14లో పని చేస్తుంది. షోన్‌లో పవర్ ఫుల్ సౌండ్ కోసం Dolby Atmosతో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.