Site icon Prime9

iQOO Neo Series: ఐక్యూ నుంచి అదిరిపోయే ఫోన్లు.. ఫీచర్లు కిరాక్.. ప్రైస్‌లో చాలా బెస్ట్..!

iQOO Neo Series

iQOO Neo Series

iQOO Neo Series: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఐక్యూ నిశ్శబ్ధంగా రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. బడ్జెట్ ప్రైస్‌లో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ ఐక్యూ నియో 10 సిరీస్‌లో iQOO Neo 10, iQOO Neo 10 Pro మొబైల్స్ ఉన్నాయి. ఈ ఫోన్‌లలో 6.78 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రండి, వీటిలో ఏది బెస్ట్ ఫోన్? ధర, స్పెసిఫికేషన్స్ ఏమిటి? తెలుసుకుందాం.

మార్కెట్‌లో ఐక్యూ మొబైల్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే సరసమైన ధరల్లో కొత్త ఫోన్లను విడుదల చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇప్పుడు, ఇది ఐక్యూ నియో 10, ఐక్యూ నియో 10 ప్రో అనే రెండు స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసింది. ఈ ఫోన్‌లలో 6.78 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా, 1TB స్టోరేజ్, 6100mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

iQOO Neo 10, Neo 10 Pro Price
కంపెనీ ఐక్యూ నియో 10, ఐక్యూ నియో 10 ప్రో మొబైల్‌లను ఐదు స్టోరేజ్ ఆప్షన్‌లలో విడుదల చేసింది. ఐక్యూ Neo 10 ఫోన్ 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 28,000. 16GB+256GB స్టోరేజ్ ధర రూ.32,600. ఉంది 12GB+512GB స్టోరేజ్ ధర రూ.30,300 ఉంది 16GB+512GB స్టోరేజ్ ఆప్షన్ రూ.36,100కి అందుబాటులో ఉంది. 16GB+1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,030.

iQOO Neo 10 Pro ఫోన్ 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 37,300కి విడుదల చేసింది. 12GB + 512GB స్టోరేజ్ ధర రూ. 40,800. ఉంది 16GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,600. ఉంది 16GB + 512GB నిల్వ ఎంపిక రూ. 44,300కి అందుబాటులో ఉంది. 16GB + 1TB స్టోరేజ్ వేరియంట్ 50,200 రూపాయలకు ప్రారంభించారు.

ఐక్యూ నియో 10, నియో 10 ప్రో టాప్ 5 ఫీచర్ల విషయానికి వస్తే మొబైల్‌లు 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. నియో 10 ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. నియో 10 ప్రో మెడిటెక్ డైమన్సిటీ 9400 ప్రాసెసర్‌తో విడుదలైంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆరిజిన్ OS 5తో పని చేస్తాయి.

ఐక్యూ Neo 10, నియో 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు 16GB RAM + 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో  వస్తాయి. ఈ ఫోన్‌లో వర్చువల్ ర్యామ్ కూడా అందుబాటులో ఉంది. మొబైల్‌లు రెండూ 50-మెగాపిక్సెల్ Sony ప్రైమరీ కెమెరాను కలిగి ఉన్నాయి. నియో 10 ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. నియో 10 ప్రో ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం రెండు మొబైల్‌లు 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉన్నాయి.

ఐక్యూ నియో 10, నియో 10 ప్రో ఫోన్‌లు రెండూ 6100mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీ. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 120W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందించారు. మీరు కేవలం 15 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయచ్చని కంపెనీ తెలిపింది. రెండు స్మార్ట్‌ఫోన్‌లలో 3డి అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. స్టీరియో స్పీకర్లు, హై-ఫై ఆడియో సపోర్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.4, NFC, USB టైప్-C ఉన్నాయి.

Exit mobile version