Site icon Prime9

Realme GT 7 Pro First Sale: రేపే ఫస్ట్ సేల్.. అండర్ వాటర్ ఫోటోగ్రఫీ.. రియల్‌మి నుంచి కొత్త ఫోన్..!

Realme GT 7 Pro First Sale

Realme GT 7 Pro First Sale

Realme GT 7 Pro First Sale: Realme ఇటీవల భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌గా Realme GT 7 ప్రోని విడుదల చేసింది. మీరు దీన్ని కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీకు శుభవార్త ఉంది. ఫోన్ మొదటి సేల్ రేపటి నుండి అంటే అక్టోబర్ 29 నుండి ప్రారంభమవుతుంది. మొదటి సేల్‌లో బ్యాంక్ ఆఫర్ కంటే తక్కువ ధరకే ఫోన్ లభిస్తుంది. ఫోన్ గరిష్టంగా 16GB RAMతో 512GB వరకు స్టోరేజ్ కలిగి ఉంది. ఫోన్ పెద్ద AMOLED డిస్‌ప్లే, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. అండర్‌వాటర్ ఫోటోగ్రఫీ మోడ్ ఫోన్‌లో అందుబాటులో ఉంది. అంటే నీటి అడుగున కూడా ఫోటోలను క్యాప్చర్ చేయచ్చు. ఫోన్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Realme GT 7 Pro Price
భారతదేశంలో Realme GT 7 ప్రో ధర 12GB + 256GB వేరియంట్‌కు రూ. 59,999 కాగా, దాని 16GB + 512GB వేరియంట్ ధర రూ. 65,999. ఇది మార్స్ ఆరెంజ్, గెలాక్సీ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లాంచ్ అవుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ నవంబర్ 29 మధ్యాహ్నం 12 గంటలకు realme.com, amazon.inలో ప్రారంభమవుతుంది. కొనుగోలుదారులు 12GB+256GB, 16GB+512GB వేరియంట్‌ల కొనుగోలుపై రూ. 3,000 బ్యాంక్ ఆఫర్‌తో పాటు 12 నెలల వరకు నో-కాస్ట్ EMI,  12GB+256GB, 16GB+512GB వేరియంట్‌ల కొనుగోలుపై 1 సంవత్సరం అదనపు స్క్రీన్ డ్యామేజ్ వారంటీని పొందవచ్చు. realme.com, amazon.in ద్వారా మీరు బీమాను కూడా పొందవచ్చు.

Realme GT 7 Pro Specifications
ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల LTPO AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది ఫుల్ HD+ రిజల్యూషన్, గరిష్టంగా 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. డిస్‌ప్లే క్వాడ్-కర్వ్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. డాల్బీ విజన్, HDR10+ కంటెంట్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ అల్యూమినియం బిల్డ్‌తో వస్తుంది. AG గ్లాస్ వెనుక ప్యానెల్‌ను కలిగి ఉంది. అలానే IP69 రేటింగ్‌, నెక్స్ట్ AIకి కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇందులో అనేక AI ఫీచర్లు ఉన్నాయి.

భారతదేశంలో కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉన్న మొదటి ఫోన్ ఇదే. ఇది గరిష్టంగా 16GB వరకు LPDDR5X RAM. 512GB వరకు UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. చిప్‌సెట్ 3nm ఫాబ్రికేషన్ ప్రాసెస్ ఉపయోగించి తయారు చేశారు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6.0తో ఫోన్ రన్ అవుతుంది. కంపెనీ మూడేళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది.

ఫోన్‌లో ఆసక్తికరమైన కెమెరా సెటప్ కూడా ఉంది. ఫోన్‌లో Sony IMX906 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony IMX882 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా,  Sony IMX355 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఫోన్‌లో AI అల్ట్రా-క్లియర్ స్నాప్ కెమెరా,  ఫ్లాష్ స్నాప్ మోడ్‌తో AI జూమ్ అల్ట్రా క్లారిటీ ఉన్నాయి.  ఇందులో ఫస్ట్ అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మోడ్ కూడా ఉంది.

చైనాలో విడుదల చేసిన మోడల్ 6500mAh బ్యాటరీని కలిగి ఉంది.  అయితే కంపెనీ దీనిని 5800mAh బ్యాటరీతో భారతదేశంలో విడుదల చేసింది. ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది చైనాలో లాంచ్ చేసిన వేరియంట్‌కు సమానం. అయితే తక్కువ సామర్థ్యంతో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. GT 7 ప్రో కేవలం 30 నిమిషాల్లో 1 నుండి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.

Exit mobile version