Smart Phone: ప్రస్తుత సమాజంలో అందరూ స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజర్లు ఎక్కువుగా ఉన్నారు. మనం చిన్న షాప్ దగ్గరికి వెళ్ళినా పేమెంట్స్ అన్నీ స్మార్ట్‌ఫోన్ నుంచే చేస్తున్నాం. మనకి సమయం దొరికినప్పుడు సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఇలా చాలా మందికి ఫోన్ చేస్తుంటాం. అలాగే మనం విలువైన సమాచారాలన్ని కూడా మన స్మార్ట్‌ఫోన్‌లోనే స్టోర్ చేసుకుంటాము.అందుకే మన మొబైళ్లను చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి.
పబ్లిక్ వైఫై అసలు వాడకండి..
మనలో చాలా మంది ఫ్రీగా వస్తుంది కదా అని స్మార్ట్‌ఫోన్‌లో పబ్లిక్ వైఫైకి కనెక్ట్ చేసుకుంటారు. అలా చేసుకోవడం వలన మీ ఫోన్ రిస్క్ లో పడే అవకాశం ఉంది. పబ్లిక్ వైఫై, పాస్‌వర్డ్ లేని ఏ వైఫై నెట్‌వర్క్‌లను వాడకండి. దీని వల్ల మీ ఫోన్ హ్యాకింగ్ అయ్యే ప్రమాదం ఉంది.
ఓల్డ్ యాప్స్ ఉంచుకోకండి..
కొంత మంది స్మార్ట్‌ఫోన్‌లో పాత వెర్షన్ యాప్స్‌నే ఎక్కువుగా వాడుతుంటారు. అలాగే కొత్త అప్‌డేట్‌లు వచ్చిన కూడా చేసుకోకుండా అలాగే ఉంటారు. ఇది కూడా ఒక రకంగా మంచిదే. ఈ యాప్స్ అప్‌డేట్ వల్ల కొత్త ఫీచర్లతో పాటు బగ్స్ ఏవైనా ఉన్నా వీటి ద్వారా ఫిక్స్ అవుతాయి.