Site icon Prime9

Samsung Galaxy S25 Series: సూపర్ కూల్ ఫీచర్స్.. గెలాక్సీ ఎస్25 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ఈసారి రచ్చ మామూలుగా ఉండదు..!

Samsung Galaxy S25 Series

Samsung Galaxy S25 Series

Samsung Galaxy S25 Series: టెక్ మార్కెట్లో ఎన్నో మొబైల్ బ్రాండ్లు ఉన్నప్పటికీ చాలా మంది ఫేవరెట్‌గా సామ్‌సంగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సామ్‌సంగ్ అదరిపోయే శుభవార్త అందించింది. S25 సిరీస్‌లో కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇవి కొనుగోలుదారులకు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ధరల పరంగా మంచి ఎంపికగా ఉంటాయి. అంతేకాకుండా వాటి ఆకర్షణీయమైన డిజైన్, ప్రీమియం లుక్స్, స్లిమ్ బిల్డ్ ఆకర్షిస్తాయి.  అయితే ఈ సిరీస్‌లో ఎటువంటి మోడల్స్ ఉంటాయి? మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయో తెలుసుకుందాం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ త్వరలో దేశంలోకి రానుంది. ఈ సిరీస్  ప్రీమియం మోడల్స్ Galaxy S25+,  Galaxy S25 Ultra ఉంటాయి. ఇటీవలే ఇవి భారతీయ వైరిఫైడ్ వెబ్‌సైట్ BISలో గుర్తించారు. కంపెనీ సాధారణంగా ఈ సిరీస్‌లో మూడు మోడళ్లను విడుదల చేస్తుంది. ఇది కాకుండా FE మోడల్ కూడా తరువాత పరిచయం చేయనున్నారు. BISలో లిస్ట్ చేసిన ఈ రెండు ప్రీమియం Samsung ఫోన్‌ల మోడల్ నంబర్‌లతో సహా అనేక సమాచారం కూడా బహిర్గతమైంది.

ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. ఈ రెండు ఫోన్‌లు వరుసగా SM-S936B, SM-S938B మోడల్ నంబర్‌లతో BISలో లిస్ట్ అయ్యాయి. ఈ రెండు సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల చేయవచ్చని BIS జాబితా చూపిస్తుంది. ఇంతకు ముందు కూడా Samsung ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్ గురించి చాలా సమాచారం ఆన్‌లైన్‌లో వెల్లడైంది. నివేదిక ప్రకారం కంపెనీ ఈ సిరీస్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబోతోంది. ఇది కాకుండా Galaxy S25, Galaxy S25+ డిజైన్‌లో చాలా పెద్ద మార్పులు చూడవచ్చు.

ఈ సంవత్సరం Samsung Galaxy S25 Ultraలో గుండ్రని ఎడ్జ్‌ను చూడవచ్చు. అలానే ఫోన్ గత సంవత్సరం మోడల్‌తో పోలిస్తే పదునైన అంచులను కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంటుంది. దీనిలో 200MP ప్రైమరీ కెమెరా అందించారు. ఈ సంవత్సరం సామ్‌సంగ్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్  8 ఎలైట్ ప్రాసెసర్‌తో తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను ప్రారంభించనుంది. ఇందులో మీరు Exynos వేరియంట్‌ని పొందలేరు. ఈ సిరీస్ అల్ట్రా మోడల్‌లో టైటానియం, బ్లూ, బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్‌లు అందుబాటులో ఉంటాయి.

సామ్‌సంగ్ ఈ మూడు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు Android 15 ఆధారంగా OneUI 7 తో వస్తాయి. LTPO 2X OLED డిస్‌ప్లే  వీటిలో చూడవచ్చు. ఫోన్ డిస్‌ప్లే  120Hz అధిక రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీనిలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఉంటుంది. సామ్‌సంగ్ ఈ సిరీస్ మునుపటి సిరీస్ కంటే పెద్ద బ్యాటరీతో రావచ్చు. ఇది కాకుండా ఫోన్‌లో మరెన్నో హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లను చూడవచ్చు.

Exit mobile version