Site icon Prime9

Samsung Galaxy S25 Series: దీన్ని కొట్టేది ఉందా.. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్‌ ఫీచర్స్ లీక్.. ఈసారి కొత్తగా..!

Samsung Galaxy S25 Series

Samsung Galaxy S25 Series

Samsung Galaxy S25 Series: స్మార్ట్‌ఫోన్ మేకర్ సామ్‌సంగ్ తన రాబోయే ఫ్లాగ్‌షిప్ మొబైల్ గెలాక్సీ ఎస్25 సిరీస్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది వచ్చే ఏడాది అంటే జనవరి 2025లో మార్కెట్‌లోకి రావచ్చని భావిస్తున్నారు. ఈ లైనప్‌లో గెలాక్సీ ఎస్25, ఎస్ 25 ప్లస్ ఉంటాయి. అయితే ఫోన్ లాంచ్‌కు ముందే దాని డిజైన్ లీక్ అయింది. ఓ టెక్ వీరుడు ఫోన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో అనేక కొత్త ఫీచర్లు ఉంటాయని వెల్లడించాడు.  ఈ నేపథ్యంలో ఈ సామ్‌సంగ్ ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అల్ట్రా మోడల్ డిఫరెంట్ డిజైన్‌తో రానుంది.  ఈ సిరీస్‌లోని చాలా అప్‌గ్రేడ్‌లు అల్ట్రా మోడల్‌లో కనిపిస్తాయి. ఇది దీని ముందు ఎస్24 అల్ట్రా కంటే ఎక్కువ రౌండ్ కార్నర్ డిజైన్‌తో వస్తుంది. ఇది చేతిలో పట్టుకోడానికి ఈ వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

కెమెరా సెటప్ గురించి మాట్లాడితే కేసు ప్రకారం గెలాక్సీ ఎస్25,  ఎస్25 ప్లస్ ట్రిపుల్ లెన్స్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. అయితే గెలాక్సీ ఎస్25 అల్ట్రా, గెలాక్సీ ఎస్24 సిరీస్ వలె అదే క్వాడ్ లెన్స్ సెటప్‌ను చూడచ్చు. అల్ట్రా రెండు లెన్స్‌లలో అప్‌గ్రేడ్‌ల రిఫరెన్స్ కూడా ఉంది. లీక్‌లు నిజమైతే ఈ అప్‌గ్రేడ్‌లు సామ్‌సంగ్ పాత కెమెరా పనితీరును మరింత మెరుగుపరుస్తాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ కేసు లీక్‌లతో పాటు, కొన్ని డమ్మీ యూనిట్లు కూడా ఇంతకముందు బయటకువచ్చాయి. ఇది 2025 మోడల్స్ కొన్ని చిన్న మార్పులతో 2024 మోడల్‌ల మాదిరిగానే ఉంటాయని వెల్లడించింది. ఇది కాకుండా గెలాక్సీ S25 సిరీస్ ప్రస్తుత మోడల్ కంటే సన్నగా ఉంటుందని మరొక నివేదిక పేర్కొంది.

ప్రాసెసర్ విషయానికి వస్తే నివేదికల ప్రకారం.. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రావచ్చు. దీని ముందు మోడల్ కంటే ఇది చాలా పవర్‌ఫుల్ ప్రాసెసర్. కంపెనీ దీనిలో ర్యామ్, స్టోరేజ్‌ను కూడా పెంచే అవకాశం ఉంది. ఇది వినియోగదారులు మల్టీ టాస్కింగ్, ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అందిస్తుంది.

బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే.. గెలాక్సీ  25 ​​4000ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది, 25 ప్లస్ 49000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. గెలాక్సీ 25 అల్ట్రా 5000ఎమ్ఏహెచ్  అతిపెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Exit mobile version