Site icon Prime9

Samsung Galaxy Z Fold 6 Special Edition: ఫోల్డింగ్ ఫోన్ అంటే ఇలా ఉండాలి.. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 స్పెషల్ ఎడిషన్‌ లాంచ్!

Samsung Galaxy Z Fold 6 Special Edition

Samsung Galaxy Z Fold 6 Special Edition

Samsung Galaxy Z Fold 6 Special Edition: ఊహించినట్లుగానే సామ్‌సంగ్ తన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. వచ్చే వారం నుంచి ఇది ఎంపిక చేసిన మార్కెట్‌లలో సందడి చేయనుందని సామ్‌సంగ్ ప్రకటించింది. ఈ సామ్‌సంగ్ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాదిలో ప్రారంభమైన గెలాక్సీ  Z బోల్ట్ 6 మోడల్ కంటే సన్నగా, తేలికగా ఉంది. ఇది కెమెరా, డిస్ప్లేలో కూడా పెద్ద అప్‌గ్రేడ్‌లను తెస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 8 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే,  6.5 అంగుళాల ఔటర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిమైండర్‌గా స్టాండర్డ్ వేరియంట్‌లో 7.60 అంగుళాల ఇన్నర్,  6.3 అంగుళాల అవుట్ డిస్‌ప్లేలు ఉన్నాయి. స్టాండర్డ్ ఎడిషన్ కంటే స్పెషల్ ఎడిషన్ 1.5mm సన్నగా 3గ్రాములు తేలికగా ఉంటుంది.

కెమెరాల విషయానికొస్తే సామ్‌సంగ్ తన ప్రత్యేక ఎడిషన్‌లో ప్రైమరీ వైడ్ యాంగిల్ షూటర్‌ను 200 మెగాపిక్సెల్‌లకు పెంచింది. మిగిలిన లెన్స్‌లకు ఏవైనా మార్పులు చేయచ్చు. రిమైండర్‌గా స్టాండర్డ్ ఎడిషన్‌లో 50MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది.  ఇది చాలా పెద్ద అప్‌గ్రేడ్.

పైన పేర్కొన్న 2 ఛేంజస్ కాకుండా స్టాండర్డ్ ఎడిషన్,  సామ్‌సంగ్ Z బోల్ట్ 6 స్పెషల్ ఎడిషన్ మధ్య ఎలాంటి తేడాలు లేవు. అంటే గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్పెషల్ ఎడిషన్ కెమెరా సెటప్‌లో 200MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా + 10MP టెలిఫోటో లెన్స్, ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి.

సెల్ఫీల కోసం కవర్ స్క్రీన్‌పై 10MP కెమెరా, లోపలి డిస్‌ప్లేలో 4MP అండర్-డిస్‌ప్లే కెమెరా ఉన్నాయి. బ్యాటరీ విషయానికొస్తే ఇది 25W వైర్డ్, 15W వైర్‌లెస్, 4.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4400mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. దీనిలో 16GB RAM+ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోన్ Galaxy AI ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

ఇది దక్షిణ కొరియాలో సుమారుగా రూ.1,70,000 ధరతో విడదలైంది. ఇది సింగిల్ 16GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర. ఫోన్ బ్లాక్ షాడో కలర్ ఆప్షన్ క్రింద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అక్టోబర్ 25 నుంచి దక్షిణ కొరియా సామ్‌సంగ్ వెబ్‌సైట్,  టీ డైరెక్ట్ షాప్, కేడీ, ఈయూ ప్లస్ వంటి ఇతర ఆన్‌లైన్ ఛానెల్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. సామ్‌సంగ్ ఈ స్పెషల్ ఎడిషన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు గెలాక్సీ రింగ్, గెలాక్సీ వాచ్ అల్ట్రా, గెలాక్సీ బడ్స్ 3 ప్రో,  ఇతర ఉత్పత్తులకు తగ్గింపు కూపన్‌లను పొందుతారు

Exit mobile version