Samsung Galaxy S25 Edge Camera Setup: ప్రస్తుతం దేశంలో అత్యంత సన్నని, ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్. దీని బరువు 163 గ్రాములు కాగా, మందం 5.8 మి.మీ. ఇది ప్రీమియం మాత్రమే కాదు, అత్యుత్తమ కెమెరా సెటప్‌తో కూడా వస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇందులో శక్తివంతమైన ప్రాసెసర్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఫోటోగ్రఫీ లేదా వీడియోలు షూట్ చేయడం ఇష్టపడితే కొత్త Galaxy S25 Edge మీకు మంచి ఆప్షన్. ఈ ఫోన్ కెమెరా ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
మీరు ఫోటోగ్రఫీ లేదా వీడియో తయారీపై ఆసక్తి కలిగి ఉంటే కొత్త Galaxy S25 Edge మిమ్మల్ని నిరాశపరచదు. ఈ ఫోన్‌లో 200MP వైడ్-యాంగిల్ కెమెరా ఉంది, దీనిలో ఎస్25 అల్ట్రా సెన్సార్ అందించారు. దీనితో పాటు, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది.
వెనుక కెమెరా సెటప్ సహాయంతో, మీరు 240fps @FHD, 120fps @FHD, 120fps @UHD స్లో మోషన్ వీడియోలను షూట్ చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు UHD 8K (7680 x 4320) @ 30fps వరకు వీడియోలను కూడా సులభంగా షూట్ చేయవచ్చు. తక్కువ కాంతిలో కూడా మీరు మంచి షాట్లను క్యాప్చర్ చేయచ్చు. మీరు కంటెంట్ క్రియేటర్ అయితే ఈ ఫోన్ మీకు సరైనదని నిరూపించవచ్చు.
ఈ ఫోన్ డిజైన్ ప్రీమియం కర్వీగా ఉంది. దీని బరువు 163 గ్రాములు. కెమెరా సెటప్ దాని వెనుక భాగంలో ఇచ్చారు. ఇందులో 6.7-అంగుళాల QHD+ డిస్‌ప్లే ఉంది, ఇది చాలా గొప్పగా,రంగురంగులగా ఉంటుంది. ఈ ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు చూడటం సరదాగా ఉంటుంది. మీరు ఈ డిస్‌ప్లేను సూర్యకాంతిలో కూడా క్లియర్‌గా చూడచ్చు.
గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అందించారు. ఈ ఫోన్‌లో 3,900mAh బ్యాటరీ ఉంది, ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పై రన్ అవుతుంది. ఇది AI స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. దీని 12GB RAM +256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,09,999 కాగా, దాని 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ రూ.1,21,999 కు లభిస్తుంది.