Site icon Prime9

Samsung Galaxy M15 5G Prime Edition: బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌.. సామ్‌సంగ్ స్పెషల్ ఎడిషన్.. ఇప్పుడు కొంటే చాలా బెటర్..!

Samsung Galaxy M15 5G Prime Edition

Samsung Galaxy M15 5G Prime Edition

Samsung Galaxy M15 5G Prime Edition: బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ లవర్స్‌కు అదిరిపోయే శుభవార్త. మీ వాలెట్‌ను ఖాళీ చేయకుండా ఇప్పుడు తక్కువ ధరకే ఫోన్ కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఈ రోజు Amazonలో 15,000 లోపు అందుబాటులో ఉన్న అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ డీల్‌లను తీసుకొచ్చాము. ఈ Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6100+ ప్రాసెసర్‌తో 4GB RAM, 6000mAh బ్యాటరీతో ఉంటుంది.

Samsung Galaxy M15 5G ప్రైమ్ ఎడిషన్‌లో 50MP మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 13MP మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ Android 14తో రన్ అవుతుంది. 4 సంవత్సరాల ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లకు సపోర్ట్ ఇస్తుంది. బ్లూ టోపాజ్, సెలెస్టియల్ బ్లూ, స్టోన్ గ్రే కలర్ ఆప్షన్‌లలో ఫోన్ అందుబాటులో ఉంది.

Samsung Galaxy M15 5G Offer
ఈ సరికొత్త Samsung Galaxy M15 5G ప్రైమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో 25 సెప్టెంబర్ 2024న విడుదలైంది. Samsung Galaxy M15 5G ప్రైమ్ ఎడిషన్ మొత్తం 3 వేరియంట్‌లలో ఉంది. దీని బేస్ 4GB + 128GB వేరియంట్ ధర రూ.13,499.

దీని ఇతర 6GB + 128GB ధర రూ. 16,499 , 8GB + 128GB మోడల్ ధర రూ. 16999. భారతదేశంలో Galaxy M15 5G ప్రైమ్ ఎడిషన్‌ను ఇప్పుడు Amazon, Samsung India వెబ్‌సైట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy M15 5G Features
సామ్‌సంగ్ గెలాక్సీM15 5జీ ప్రైమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్ HD+ (1,080 x 2,340 పిక్సెల్‌లు) సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 4GB RAM+ 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో MediaTek డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.

ఫోన్ Android 14-ఆధారిత One UI 6.0కి సపోర్ట్ ఇస్తుంది. నాలుగు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇస్తుంది. Galaxy M15 5G ప్రైమ్ ఎడిషన్ భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇందులో నాక్స్ సెక్యూరిటీ, క్విక్ షేర్ ఫీచర్‌లు, కాల్ క్లారిటీ కోసం వాయిస్ ఫోకస్ కూడా ఉన్నాయి. ఫోన్‌లో డ్యూయల్ 5G, 4G LTE, GPS, బ్లూటూత్ 5.3, USB టైప్-సి పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి.

Exit mobile version