Site icon Prime9

Jio Diwali Offer: జియో ఆఫర్ల రచ్చ.. రూ.699కే ఫోన్.. ఫ్రీగా బోలెడు వోచర్‌లు!

Jio Diwali Offer

Jio Diwali Offer

Jio Diwali Offer: పండుగ సీజన్‌లో ప్రతి ఒక్కరూ తమ కస్టమర్‌లకు ఉత్తమమైన ఆఫర్‌లను అందించడానికి ప్రయత్నిస్తున్నారు. రిలయన్స్ జియో కూడా ఈ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ముఖేష్ అంబానీకి చెందిన జియో భారత్ దీపావళి ధమాకా ఆఫర్ ప్రకటించింది. దీని కింద Jio Bharat 4G ఫోన్‌ను కేవలం 699 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఎక్కువ ఖర్చు లేకుండా 2జీ ఫీచర్ ఫోన్ నుంచి 4జీ ఫోన్‌కు మారొచ్చు. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఈ క్రమంలో జియో ఫోన్ ధర ఎంత? ఫీచర్లు, తదితర వివరాలు తెలుసుకుందాం.

ముందుగా ఈ ఫోన్ ధర గురించి మాట్లాడుకుందాం. జియో ఈ 4జీ ఫోన్‌ను కేవలం రూ. 699కి దక్కించుకోవచ్చు. ఇది లిమిటెడ్ డీల్ అని కంపెనీ ఇప్పటికే తెలిపింది. ఇప్పుడు రూ.999 ఫోన్‌ని రూ.699 ప్రత్యేక ధరతో కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల  విషయానికి వెళ్దాం..!

ఈ 4G ఫోన్ కోసం కంపెనీ ప్రత్యేక నెలవారీ ప్లాన్‌ను తీసుకువచ్చింది. దీని ధర రూ. 123. ఈ ప్లాన్ కింద మీకు అనేక ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14 జీబీ డేటా, 455 + లైవ్ టీవీ ఛానెల్‌లు, సినిమా ప్రీమియర్లు, జియో సినిమా యాక్సెస్ చేయవచ్చు. ఇది కాకుండా ఈ ఫోన్‌లో QR కోడ్ స్కాన్‌తో డిజిటల్ పేమెంట్స్ చేసే ఫీచర్ ఉంది. జియో చాట్ కూడా ఇందులో అందించారు. దీని ద్వారా మీరు వీడియోలు, ఫోటోలు, మెసేజస్ షేర్ చేయవచ్చు.

రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఎంచుకున్న ప్లాన్‌లతో రీఛార్జ్ చేస్తే ఈజీమైట్రిప్, మెసేజస్, అజియో, స్విగ్గీ నుంచి వోచర్‌లు,  ఆఫర్‌లను పొందుతున్నారు. ఈ ఆఫర్ అక్టోబర్ 26 నుంచి నవంబర్ 5, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. Jio.com, MyJio యాప్ నుండి దీనిని ఉపయోగించవచ్చు.

మీరు జియో True 5Gని రూ. 899, రూ. 3,599 నుండి రీఛార్జ్ చేయడం ద్వారా రూ. 3,350 ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇందులో మీరు ఈజీమైట్రిప్ నుండి రూ. 3,000 వోచర్, అజియోలో రూ. 200 కూపన్, స్వీగ్గీ నుండి రూ. 150 వోచర్ పొందవచ్చు.

Exit mobile version