Site icon Prime9

Call History: ఇంత ఈజీనా.. కాల్ హిస్టరీ చెక్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోండి..!

Call History

Call History

Call History: నేడు స్మార్ట్‌ఫోన్ చాలా మందికి నిత్యావసరంగా మారింది. మాట్లాడటం నుండి ప్రతి ముఖ్యమైన పని స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా జరుగుతోంది. మీరు ఆఫీసు లేదా ఏదైనా వ్యక్తిగత పని కోసం కాల్ మాట్లాడతే.. నెలల నాటి కాల్ హిస్టరీని లేదా డిలీట్ చేసిన కాల్ హిస్టరీని తిరిగి పొందవలసి వస్తే, అది కష్టమైన పని కావచ్చు. అయితే ఇప్పుడు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు రిలయన్స్ జియో,ఎయిర్‌టెల్ యూజర్ అయితే ఈ ట్రిక్ గత 6 నెలల కాల్ హిస్టరీని మీ ముందు ఉంచుతుంది. జస్ట్ ఈ ట్రిక్ అనుసరించండి.

మీరు ఏ రోజు ఎవరికి డయల్ చేసారు లేదా ఎవరి కాల్ అందుకున్నారు అనే వివరాలన్నీ హిస్టరీలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మాత్రమే కాదు, ఈ యాప్ నుండి సేకరించిన హిస్టరీ మీరు ఏ నంబర్‌లో ఎంతసేపు మాట్లాడారో కూడా చూపుతుంది. ఇది గొప్ప ఉపాయం అయినప్పటికీ టెక్నాలజీ తెలియని వ్యక్తి చేతిలోకి వస్తే, దాని వల్ల ప్రయోజనం కంటే హాని జరుగుతుంది.

Airtel వినియోగదారులు SMS ద్వారా ఈ స్టెప్స్ అనుసరించాలి

1: మీ మొబైల్‌లో మెసేజ్ యాప్‌ని ఓపెన్ చేయండి.
2. రిసీవర్‌గా “121” అని టైప్ చేయండి.
3: మేజెస్ దగ్గర “EPREBILL” అని టైప్ చేయండి.
4: గత 6 నెలల కాల్‌లు, ఇమెయిల్ IDలతో పాటు “EPREBILL” కోడ్‌ను టైప్ చేసి పంపండి.
5: దీని తర్వాత PDF మీ ఇమెయిల్ IDకి వస్తుంది.
6: పిడిఎఫ్ తెరవడానికి మెసేజ్‌లో ఇచ్చిన పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.

ఉదాహరణ
EPREBILL DECEMBER pavan04@gmail.cm

Exit mobile version
Skip to toolbar